STOCKS

News


ఆగని రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు ర్యాలీ..!

Tuesday 10th July 2018
Markets_main1531220552.png-18175

3శాతం లాభపడిన షేరు
ముంబై:- ఆయిల్‌రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరు ర్యాలీ ఆగడం లేదు. వరుసగా మూడో రోజూ రిలయన్స్‌ షేరు లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేడు ఉదయం రిలయన్స్‌ షేరు 1,002.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.78 శాతం లాభపడి రూ.1024.90ల గరిష్టస్థాయిని నమోదు చేసింది. బ్రిటిష్‌ పెట్రోలియం(బీపీ)తో ఆర్‌ఐఎల్‌ ఏర్పాటు చేసిన భాగస్వామ్య సంస్థ(జేవీ) ఇండియా గ్యాస్‌ సొల్యూషన్స్‌ ద్వారా ప్రభుత్వం చేపట్టనున్న సిటీ గ్యాస్‌ పంపిణీ లైసెన్సుల వేలంలో ప్రభుత్వం నిర్వహించనున్న గ్యాస్‌ పంపిణీ లైసెన్స్‌ వేలంలో బిడ్డింగ్‌ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు ఆర్‌ఐఎల్‌ షేరు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో 3 శాతం లాభపడి రూ.1025.75 వద్ద ముగిసింది.



You may be interested

రూ.300 కోట్ల వ్యక్తిగత రుణాలిస్తాం

Tuesday 10th July 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ముత్తూట్‌ ఫైనాన్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు జారీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇటీవలే వ‍్యక్తిగత రుణాల విభాగంలోకి ప్రవేశించిన ఈ సంస్థ... 2018 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు రూ.30 కోట్లను కస్టమర్లకు అందించింది. అయిదేళ్లలో రూ.3,000 కోట్ల స్థాయికి ఈ విభాగాన్ని తీసుకెళతామని ముత్తూట్‌ ఫైనాన్స్‌ ఈడీ జార్జ్‌ ఎం అలెగ్జాండర్‌

మైండ్‌ట్రీ కొనొచ్చు- ఆనంద్ రాఠీ

Tuesday 10th July 2018

కంపెనీ: మైండ్‌ట్రీ లిమిటెడ్‌ సిఫార్సు: ఆనంద్ రాఠీ రీసెర్చ్‌ ప్రస్తుత ధర: రూ.1,038 (జులై 10, 2018న) టార్గెట్‌ ధర: రూ.1088 రెకమండేషన్‌: కొనొచ్చు కొనుగోలు శ్రేణి: రూ.1037-1047 స్టాప్‌లాస్‌: రూ.1019 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.191 /105 ఈ షేరు స్వల్పకాలిక సగటు కదలికల స్థాయి ఎగువకు చేరుకుని సానుకూల సంకేతం ఇచ్చిందని ఆనంద్ రాఠీ విశ్లేషించింది. కీలక ట్రెండ్‌ పాజిటీవ్‌గా ఉన్నందు వల్ల రూ.1019 వద్ద స్టాప్‌ లాస్‌ నిర్వహిస్తూ.. రూ.1037-1047 స్థాయిలో షేరును కొనుగోలుచేయవచ్చని

Most from this category