కొత్త రికార్డు హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్..!
By Sakshi

ముంబై:- దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు బుధవారం మరో కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఈరోస్ ఇంటర్నేషనల్‌లో 5 శాతం వాటాను కొనుగోలు చేయడంతో నేడు ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ 1శాతం వరకు ర్యాలీ చేసింది. అన్ని అనుమతులు పొందిన అనంతరం తమ సంస్థలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 5 శాతం వాటా కొనుగోలు పూర్తయ్యిందని ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈరోస్ నుంచి రిలయన్స్ 31,11,088 'ఏ' రకం సాధారణ షేర్లను కొనుగోలు చేసింది. కంపెనీలో ఆ వాటాల పరిమాణం 5 శాతం. ఇందుకు గాను రిలయన్స్ ఒక్కో షేరుకు 15 డాలర్ల చొప్పున మొత్తం 46.6 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ లావాదేవీ వ్యవహారంలో గోల్డ్‌మన్ శాక్స్ ఈరోస్‌కు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించింది. నేడు బీఎస్ఈలో రిలయన్స్ షేరు రూ.1188.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కొనుగోలు వార్తలు వెలుగులోకి రావడంతో 2.06 శాతం లాభపడి రూ.1208.00 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1183.55)తో పోలిస్తే 1.81 శాతం లాభపడి రూ.1205.00 వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.760.53లు, రూ.1128.75లుగా నమోదయ్యాయి. సూచీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు హెవీ వెయిట్ షేరు కావడంతో నేడు సెన్సెక్స్ సూచీ ఆర్జించిన 223.29 పాయింట్లలో ఒక్క రిలయన్స్ షేరువి 73.83 పాయింట్లుకావడం విశేషం.
You may be interested
సిప్ నిధుల ప్రవాహం లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకే...
Wednesday 8th August 2018గతేడాది వరకు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి సిప్ పెట్టుబడులు ఎక్కువగా వచ్చేవని రిలయన్స్ నిప్సాన్ లైఫ్ ఏఎం ఈడీ, సీఈవో సుదీప్ సిక్కా తెలిపారు. అయితే ఏడాది నుంచి మరీముఖ్యంగా 3-4 నెలల కాలంలో లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి సిప్స్ ఇన్వెస్ట్మెంట్లు పెరిగాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. గత నెలలో మార్కెట్లు పడ్డప్పుడు గమనిస్తే ట్రెండ్ మారిందని తెలిపారు. గత 4-5 నెలలుగా
ఇంట్రాడే కోసం రికమండేషన్లు
Wednesday 8th August 2018బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం ప్రముఖ అనలిస్టులు కొన్ని స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. - జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్: కొనొచ్చు. అనలిస్టు- మానస్ జైస్వాల్. టార్గెట్ రూ. 235. స్టాప్‌లాస్ రూ. 204. - ఎన్సీసీ: కొనొచ్చు. అనలిస్టు- కునాల్ బత్రా. టార్గెట్ రూ. 100. స్టాప్‌లాస్ రూ. 91.5 - టాటాస్టీల్: కొనొచ్చు. అనలిస్టు- కునాల్ బత్రా. టార్గెట్ రూ. 605. స్టాప్‌లాస్ రూ. 560. - టాటాస్టీల్: కొనొచ్చు. అనలిస్టు-