STOCKS

News


2నెలల కనిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Thursday 9th May 2019
Markets_main1557387473.png-25638

ప్రైవేట్‌ రంగ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో 3శాతం నష్టపోయింది. ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం షేరు పతనానికి కారణమైంది. రానున్న రెండేళ్ల కాలంలో రిలయన్స్‌ కంపెనీ ఆదాయాలు పరిమితం కావడంతో పాటు కీలకమైన ఇంధన వ్యాపారంలో ఎదురవనున్న సమస్యలు దృష్ట్యా షేరు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. అలాగే కంపెనీకి పెరుగుతున్న రుణభారం, స్థూల రీఫైనరీ మార్జిన్లు తగ్గడం వంటి అంశాలు కంపెనీకి రానున్న రోజుల్లో ప్రతికూలంగా మారుతాయని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాము ఇదివరకు షేరుకు కేటాయించిన ‘‘ఓవర్‌ వెయిట్‌’’ రేటింగ్‌ను ‘‘ఈక్వల్‌ - వెయిట్‌’’గా కుదించడంతో పాటు షేరు కొనుగోలు ధరను రూ.1,349లకు తగ్గించినట్లు మోర్గాన్‌ స్టాన్లీ బుధవారం తెలిపింది. ఫలితంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు నేడు బీఎస్‌ఈలో అరశాతం నష్టంతో రూ.1291.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో మరింత అమ్మకాల ఒత్తిడి లోనడంతో ఒకానొక దశలో షేరు 3.50 శాతానికి పైగా నష్టపోయి రూ.1256.30ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇది షేరుకు రెండు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. మధ్యాహ్నం గం.12:30నిల.కు షేరు గతముగింపు(రూ.1299.45)తో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.1261 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 907.10 రూ.1413.75లుగా నమోదయ్యాయి. 

అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం మళ్లీ తెరపైకి రావడం, దేశీయంగా ఎన్నికల సీజన్‌ కావడంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర కారణాల నేపథ్యంలో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ వరుసగా 7రోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయంలో రిలయన్స్‌ షేరు సైతం దాదాపు 10శాతం నష్టపోయింది. ఈ క్రమంలో రిలయన్స్‌ ఇండస్టీ‍్రస్‌కు చెందిన దాదాపు రూ.69వేల కోట్ల మార్కెట్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ హరించుకోపోయింది. 



You may be interested

నష్టాల్లో మెటల్‌ షేర్లు

Thursday 9th May 2019

ప్రపంచమార్కెట్‌ ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ గురువారం మెటల్‌ భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు దాదాపు 2శాతం క్షీణించింది. అమెరికా - చైనాల వాణిజ్య యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చిన నేపధ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఆ ప్రతికూల ప్రభావంతో నేటి ట్రేడింగ్‌లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నిఫ్టీ మెటల్‌ ఇంండెక్స్‌లోని జిందాల్‌

ఐబీసీ ద్వారా బ్యాంకులకు రూ.80,000 కోట్లు

Thursday 9th May 2019

2019-20 ఆర్థిక సంవత్సరంపై ఇక్రా అంచనా న్యూఢిల్లీ: బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) కింద మొండి బకాయిలకు పరిష్కారం రూపేణా రూ.80,000 కోట్లు వసూలవుతాయని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇలా వసూలైన మొత్తం రూ.66,000 కోట్లతో పోలిస్తే పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు పెద్ద ఖాతాలైన ఎస్సార్‌ స్టీల్‌, భూషణ్‌ స్టీల్‌

Most from this category