STOCKS

News


కొనసాగుతున్న రిలయన్స్‌ ర్యాలీ

Tuesday 2nd April 2019
Markets_main1554194098.png-24928

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీ మంగళవారం కొనసాగింది. నేడు బీఎస్‌ఈలో రూ.1396.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇంధన రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఈ షేరు లాభాల బాట పట్టింది. ఫలితంగా ఇంట్రాడేలో 0.85శాతం పెరిగి రూ.1402.70ల స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం గం.1:15ని.లకు షేరు గత ముగింపు ధరతో పోలిస్తే 0.25శాతం లాభంతో రూ. 1396ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ షేరు నిన్నటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో 2.8శాతం లాభపడి రూ.1406.80ల వద్ద రికార్డు స్థాయిని తాకిన సంగతి తెలిసిందే.  కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.886.10  రూ.1406.80 లుగా నమోదయ్యాయి. 
ఇక మార్కెట్‌ విషయానికొస్తే... ఇదే సమయానికి నిఫ్టీ 37 పాయిట్లు లాభంతో 11706 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, సెన్సెక్స్‌ 132 పాయింట్లు లాభపడి 39,004 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటో, ఐటీ, ప్రభుత్వరంగ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.



You may be interested

125 స్టాకుల్లో బుల్లిష్‌ ఎంఏసీడీ క్రాసోవర్‌

Tuesday 2nd April 2019

దేశీయ సూచీల్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయని టెక్నికల్‌ చార్టులు చూపుతున్నాయి. సోమవారం ముగింపు ప్రకారం 125 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జిందాల్‌స్టీల్‌, అపోలోటైర్స్‌, జేకే టైర్స్‌, యూకో బ్యాంక్‌, ఐఓబీ,

ప్రమోటర్ల వాటా విక్రయంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ క్షీణత

Tuesday 2nd April 2019

జీఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 4శాతానికి పైగా నష్టపోయాయి. సంస్థ ప్రమోటర్లు షేర్ల విక్రయించారనే వార్తలు వెలువడటం ఇందుకు కారణమైంది. నేడు జీఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు బీఎస్‌ఈలో రూ.425.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సంస్థ ప్రధాన ప్రమోటర్‌ సుభాష్‌ చంద్ర ఓపెన్‌ మార్కెట్లో మార్చి 13, మార్చి 25 తేదిల మధ్య 76.35లక్షల ఈక్విటీ షేర్లను రూ.333 కోట్లకు విక్రయించారు. అలాగే మరో ప్రమోటింగ్‌ సంస్థ సైక్వేటర్‌ మీడియా సర్వీసెస్‌

Most from this category