STOCKS

News


సూచీలకు ఆర్‌ఐఎల్‌ అండ

Wednesday 6th March 2019
Markets_main1551863811.png-24455

బుధవారంనాటి సూచీల స్థిరమైన ర్యాలీకి  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌అండగా నిలిచింది.  చివరి రెండు సెషన్స్‌లో సూచీలు భారీగా లాభాలు ఆర్జిం‍చినప్పటికి.., ఈ షేరు స్తబ్దుగా ట్రేడైంది. నేడు ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో దాదాపు 3శాతం ర్యాలీ చేసి రూ.1271.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు 3శాతం ర్యాలీ చేయడంతో ఈ ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ అప్‌ట్రెండ్‌ను కొనసాగించాయి. నేడు నిఫ్టీ ఇండెక్స్‌ ఆర్జించిన మొత్తం 81 పాయింట్లలో 22.46 పాయింట్లు, సెన్సెక్స్‌ సాధించిన 272 పాయింట్లలో 90 పాయింట్లు  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అందించిన షేర్లు కావడం విశేషం. మధ్యాహ్నం గం.2:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.1236.95)తో పోలిస్తే 2శాతం లాభంతో రూ.1263ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలాగే ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో మొదటిస్థానాన్ని దక్కించుకుంది.



You may be interested

లాభాలు కొనసాగాయ్‌

Wednesday 6th March 2019

11050పై నిఫ్టీ ముగింపు మూడరోజూ లాభాలే. ప్రపంచ మార్కెట్లలలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., దేశీయ మార్కెట్లో మూడోరోజూ లాభాలు కొనసాగాయి. ఆర్థిక ఐటీ, ఫార్మా, మెటల్‌ షేర్ల అండతో  సెన్సెక్స్‌ 193 పాయింట్లు పెరిగి 36,636 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 11,053 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 72 పాయింట్ల స్వల్ప లాభంతో 27,625 ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అటో, మీడియా షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన

వెలుగులోకి రియల్టీ షేర్లు

Wednesday 6th March 2019

మార్కెట్‌ స్థిరమైన ర్యాలీలో భాగంగా రియల్టీ రంగ షేర్లు బుధవారం లాభాల బాటపట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.50శాతం లాభపడింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు అత్యధికంగా 8శాతం లాభపడింది. బ్రిగ్రేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, సన్‌టెక్‌ 5శాతం ర్యాలీ చేశాయి. మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫోనిక్స్‌లిమిటెడ్‌ షేర్లు

Most from this category