STOCKS

News


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 4శాతం డౌన్‌..!

Monday 1st October 2018
Markets_main1538379726.png-20753

ముంబై:- దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేరు సోమవారం 4శాతానికి పైగా నష్టపోయింది. ఈ షేరు నేడు బీఎస్‌ఈలో రూ.1258.2ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఇన్వెస్టర్లు ఈ షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 4.28శాతం నష్టపోయి రూ.1204.30 కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నాం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.1258.2) ధరతో పోలిస్తే 3శాతం నష్టంతో రూ.1218ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7.72లక్షల కోట్లుగా నమోదైంది. ఈ షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 780.00 రూ.1328.75లుగా నమోదయ్యాయి. ఇంట్రాడే నిఫ్టీ సూచీ కోల్పోయిన మొత్తం 100 పాయింట్లలో ఒక్క రిలయన్స్‌ షేరువి మాత్రమే 32.59 పాయింట్ల కావడం విశేషం.



You may be interested

సెప్టెంబర్‌లో ‘తయారీ’ జోష్‌

Monday 1st October 2018

ఆగస్ట్‌ నెలలో అనూహ్యంగా నెమ్మదించిన భారత్‌ తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో మళ్లీ పుంజుకుంది. కొత్త ఆర్డర్లు పెరగడం, ఉత్పత్తి ఎగయడం, ఉపాధి కల్పన మెరుగుపడటం వంటి అంశాలు సానుకూల ప్రభావం చూపాయి. నికాయ్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) ఈ విషయాన్ని తెలిపింది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, బలమైన అమెరికా డాలర్‌, సరఫరా తగ్గుదల, క్రూడ్‌ ధరలు ఎగయడం వంటి అంశాల వల్ల ధరల ఒత్తిడి

ఎన్‌బీఎఫ్‌సీలు చౌకేమీ కాదు

Monday 1st October 2018

జూలై, ఆగస్ట్‌లలో మంచి ర్యాలీ చేసిన బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు సెప్టెంబర్‌లో బాగా కరెక‌్షన్‌కు గరయ్యాయి. క్రూడ్‌ ధరల పెరుగుదల, వాణిజ్య లోటుపై ఆందోళనలు, వాణిజ్య ఉద్రిక్తతల భయాలు, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ సంక్షోభాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ‘మార్కెట్‌ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి నుంచి 6-7 శాతం పడిపోయింది. ఇది కేవలం భయాందోళనలను మాత్రమే సూచిస్తోంది. అంతేతప్ప వ్యాల్యుయేషన్స్‌ చౌకగా మారలేదు’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ, సీఐవో

Most from this category