STOCKS

News


రెండో రోజూ రిలయన్స్‌ ర్యాలీ

Monday 21st January 2019
Markets_main1548061779.png-23703

  • మూడున్నర గరిష్టం వద్ద షేరు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు వరుసగా రెండో రోజూ ర్యాలీని కొనసాగిస్తుంది. కంపెనీ క్యూ3లో అంచనాలకు మించిన లాభాలను ఆర్జించడం ఇందుకు నేపథ్యం. గతవారంలో గురువారం విడుదుల చేసిన గణాంకాల ప్రకారం పెట్రో, రిటైల్‌, టెలికాం విభాగాల్లో కంపెనీ రాణించడంతో మూడో త్రైమాసికంలో కంపెనీ రూ.10251 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. ఒక త్రైమాసికంలో రూ.10వేల కోట్ల పైగా లాభం నమోదు చేసిన తొలి ప్రైవేట్‌ కంపెనీగా రిలయన్స్‌ రికార్డు సృష్టించింది. ఫలితంగా గతవారం ట్రేడింగ్‌ చివరి రోజైన శుక్రవారం 4.34శాతం లాభపడి రూ.1183 ముగిసింది. గత ర్యాలీ కొనసాగిస్తూ నేడు బీఎస్‌ఈలో రూ.1193.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 4.50శాతం లాభపడి రూ. 1235.75ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇది షేరుకు మూడున్నర నెలల గరిష్టస్థాయి కావడం విశేషం. మధ్యాహ్నాం గం.2:30లకు షేరు గతముగింపు ధర (రూ.1193.90)తో పోలిస్తే 4.40శాతం లాభపడి రూ.1233.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 872.10 రూ.1328.75లుగా ఉన్నాయి.



You may be interested

నష్టాల బాటలో అటో షేర్లు

Monday 21st January 2019

మార్కెట్‌ లాభాల ర్యాలీలోనూ అటో షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో అటో రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ గురువారం 1శాతం క్షీణించింది. హీరోమోటర్‌ కార్ప్‌ 3.50శాతం, మారుతి సుజుకీ 2.50శాతం, టాటామోటర్స్‌ 1.50శాతం క్షీణత అటో షేర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు 8,844.80తో పోలిస్తే 1.20శాతం నష్టంతో 8,737.30ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో

షార్ట్‌టర్మ్‌కు టాప్‌టెన్‌ ఐడియాలు

Monday 21st January 2019

వచ్చే 2- 3 వారాల్లో మంచి రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు: 1. డాబర్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 439. స్టాప్‌లాస్‌ రూ. 416. ఇటీవల పతనం పూర్తయి బాటమ్‌అవుట్‌ చెందినట్లు కనిపిస్తోంది. రూ. 417 స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. గత రెండు సెషన్లలో బుల్స్‌ పైచేయి సాధించాయి. రూ. 420కిపైన స్థిరంగా ముగిస్తే మరింత ముందుకు దూసుకుపోతుంది. 2. హీరోమోటోకార్‌‍్ప:

Most from this category