STOCKS

News


మార్కెట్‌ టార్చ్‌బేరర్‌.. రిలయన్స్‌

Thursday 6th December 2018
Markets_main1544091216.png-22704

స్టాక్‌ మార్కెట్‌ కొత్త ర్యాలీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నేతృత్వం వహిస్తుందని సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ (ఈక్విటీ అడ్వైజర్‌) దేవాంగ్‌ మెహతా తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. విక్రయాల కోసం ఎగుమతులపై ఆధారపడే ఆటోమొబైల్‌ సంస్థలు లేదా వాహన విడిభాగాల కంపెనీలకు ప్రస్తుతం దూరంగా ఉండటం మంచిదని సూచించారు. మరోవైపు దేశీయంగా చూస్తే వాహన విక్రయాలు నెమ్మదించాయని గుర్తు చేశారు. రానున్న కాలంలో దేశీయంగా డిమాండ్‌ మెరుగుపడితే టూవీలర్‌ లేదా ఫోర్‌వీలర్‌ సంస్థలకు వాహన విడిభాగాలను సరఫరా చేసే కంపెనీలు బౌన్స్‌బ్యాక్‌ అవుతాయని పేర్కొన్నారు. అయితే భారత్‌ఫోర్జ్‌ విషయానికి వస్తే.. ఈ కంపెనీ ఇతర దేశాలపై ఎక్కువ ఆధారపడి ఉందని తెలిపారు. 
గ్లాక్సో కన్సూమర్‌-హెచ్‌యూఎల్‌ డీల్‌ వల్ల ఇరు కంపెనీల వాటాదారులు దీర్ఘకాలంలో ప్రయోజనం పొందుతాయని దేవాంగ్‌ మెహతా పేర్కొన్నారు. ఈ డీల్‌కు చాలా రెగ్యులేటరీల నుంచి ఆమోదం లభించాల్సి ఉందని తెలిపారు. హావెల్స్‌ స్టాక్‌ను ఇష్టపడతానని, అయితే ఇప్పుడు దీన్ని రికమెండ్‌ చేయడం లేదని పేర్కొన్నారు. రానున్న కాలంలో పెయింట్స్‌ కంపెనీలు మంచి పనితీరు కనబర్చవచ్చని అంచనా వేశారు. అయితే క్రూడ్‌ ధరల పెరుగుదల రూపంలో వీటికి రిస్క్‌ పొంచి ఉందని తెలిపారు. 
ఫార్మా విషయానికి వస్తే.. సన్‌ ఫార్మాపై అమ్మకాల ఒత్తిడి మరి కొంత కాలం కొనసాగవచ్చని దేవాంగ్‌ మెహతా అంచనా వేశారు. అరబిందో ఫార్మా, టొరెంట్‌ ఫార్మా, ఇప్కా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ విలీన ప్రతిపాదన నేపథ్యంలో వీటికి కొంత కాలం దూరంగా ఉండటం మంచిదని సూచించారు. కార్పొరేట్‌ బ్యాంక్‌ షేర్లకు ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. 
మార్కెట్‌ ర్యాలీ చేయాలంటే.. క్రూడ్‌, రూపాయి ధరల్లో నిలకడ రావాల్సి ఉందని దేవాంగ్‌ మెహతా పేర్కొన్నారు. అలాగే ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉందన్నారు. మార్కెట్‌పై వీటి ప్రభావం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం వీఐఎక్స్‌ గరిష్ట స్థాయిల్లోనే ఉందన్నారు. మార్కెట్‌ రక్షణాత్మక ధోరణిలో ఉందని పేర్కొన్నారు. లార్జ్‌ క్యాప్స్‌ ర్యాలీ చేయాల్సి ఉందన్నారు. అప్పుడు భయాలు తగ్గుతాయని, మిడ్‌ క్యాప్స్‌ జోరు కొనసాగిస్తాయని తెలిపారు. 
ఎన్నికలు, క్రూడ్‌, వడ్డీ రేట్లు, విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు వంటి వాటితో సంబంధం లేకుండా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరును కొనుగోలు చేయవచ్చని దేవాంగ్‌ మెహతా సిఫార్సు చేశారు. మార్కెట్‌ తదుపరి ర్యాలీకి రిలయన్స్‌ నేతృత్వం వహిందని పేర్కొన్నారు. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాక్స్‌కు, కొన్ని ఫార్మా షేర్లకు ప్రాధాన్యమివొచ్చని తెలిపారు. ఎన్‌సీసీ, అపోలో టైర్స్‌ స్టాక్స్‌ కూడా చూడొచ్చని పేర్కొన్నారు. 
 You may be interested

కంపెనీల ఎర్నింగ్స్‌లో భారీగా కోతలు

Thursday 6th December 2018

ముంబై: టాప్‌ 10 అనలిస్టులు ట్రాక్‌ చేస్తున్న 269 కంపెనీల్లో ఏకంగా 168 కంపెనీల ఎర్నింగ్స్‌ అంచనాల్లో సవరణజరిగింది. అంటే దాదాపు 60 శాతం కంపెనీల ఎర్నింగ్స్‌లో వీరు భారీగా కోతలు విధించారు. రూపాయి బలహీనత కారణంగా ఐటీ రంగాన్ని మినహాయించి మిగిలిన అన్ని రంగాల కంపెనీల ఈపీఎస్‌లను తగ్గించారు. 18 కంపెనీల్లో ఏకంగా 50 శాతం వరకు అంచనాలను సవరించారు. అత్యధికంగా టెలికం, సిమెంట్‌, హాస్పటల్‌ రంగాల్లో ఈ

బ్యాంక్‌ నిఫ్టీ 1.50 శాతం డౌన్‌

Thursday 6th December 2018

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ గురువారం 1.50శాతం నష్టపోయింది. మార్కెట్‌ పతనంలో భాగంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు బ్యాంకు నిఫ్టీ పతనానికి కారణమయ్యాయి. మధ్యాహ్నం గం.3:15ని.లకు సూచి గత ముగింపుతో పోలిస్తే 1.25శాతం నష్టంతో 26,207.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం 12 షేర్లలో 11 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా ఒక్క ఫెడరల్‌ బ్యాంక్‌ షేరు

Most from this category