STOCKS

News


మార్కెట్‌ క్యాప్‌లో రిలయన్సే నంబర్‌1

Wednesday 17th October 2018
Markets_main1539750496.png-21229

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరోసారి మార్కెట్‌ క్యాప్‌లో దేశంలోనే నంబర్‌ 1 కంపెనీగా నిలిచింది. మంగళవారం ఆర్‌ఐఎల్‌ షేరు 2.09 శాతం పెరిగి రూ.1,163.65 వద్ద బీఎస్‌ఈలో క్లోజయింది. టీసీఎస్‌ షేరు 0.64 శాతం లాభంతో 1,961.70 వద్ద స్థిరపడింది. క్లోజింగ్‌ ధర ప్రకారం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,37,576.57 కోట్లుగా ఉంది. టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,36,105.31 కోట్లు. టీసీఎస్‌ కంటే ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ విలువ రూ.1,471.26 కోట్లు అధికంగా ఉంది. మార్కెట్‌ విలువ విషయంలో ఇటీవలి కాలంలో ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ మధ్య తరచూ పోటీ నెలకొంది. మార్కెట్‌ విలువ పరంగా ఆర్‌ఐఎల్‌, టీసీఎస్‌ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (రూ.5,41,370.18 కోట్లు), ఐటీసీ (రూ.3,45,918.24 కోట్లు), హెచ్‌యూఎల్‌ (రూ.3,34,297.56 కోట్లు) ఉన్నాయి. 



You may be interested

ఫుడ్‌పాండా చేతికి హోలాషెఫ్‌

Wednesday 17th October 2018

 హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫుడ్‌ డెలివరీ కంపెనీ ఫుడ్‌పాండా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఫుడ్‌టెక్‌ కంపెనీ హోలాషెఫ్‌ను కొనుగోలు చేసింది. దీంతో ఫుడ్‌పాండా సొంత క్లౌడ్‌ కిచెన్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు వివిధ కేటగిరీల్లో సొంత బ్రాండ్‌తో ఎంట్రీ ఇచ్చేందుకు మార్గం సుగుమమైందని ఫుడ్‌పాండా ఇండియా సీఈఓ ప్రణయ్‌ జీవ్‌రాజ్కా తెలిపారు. హోలాషెఫ్‌ కొనుగోలుతో కస్టమర్ల ఆహార అభిరుచులు, ఇష్టాలు తెలుస్తాయని... దీంతో సొంత బ్రాండ్‌కు అవకాశముంటుందని ఆయన ఒక

ఫ్యూచర్‌ రిటైల్‌తో తుది దశకు అమెజాన్‌ సంప్రదింపులు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఈ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ కిషోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ రిటైల్‌లో వాటా తీసుకోవడం దాదాపు ఖాయమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చర్చలు పురోగతికి చేరాయని, 3-4 వారాల్లో నిర్ణయం వెలువడచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చలు పురోగతిలో ఉన్నాయని, రూ.2,000 కోట్లకు పైగా పెట్టుబడితో వాటా

Most from this category