ఆర్‌కామ్ 14 శాతం పతనం
By Sakshi

ముంబై:- పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయి నానావస్థలు పడుతున్న రిలయన్స్ కమ్యూనికేషన్ కంపెనీ షేర్లు నష్టాల బాట పట్టాయి. గురువారం ఇంట్రాడేలో ఆర్‌కామ్ షేర్లు 14 శాతం పతనమయ్యాయి. నేడు బీఎస్ఈలో ఆర్‌కామ్ షేర్లు రూ.20.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో తెలియని కారణాలతో కంపెనీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా షేరు నేటి ఇంట్రాడేలో 14శాతం నష్టపోయి రూ.17.85ల కనిష్టానికి పతమమయ్యాయి. మధ్యాహ్నం గం.3:00లకు షేరు గతముగింపు ధర(రూ.20.69)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ. 18.54ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసుగా రూ. 9.60 రూ.41.77లుగా నమోదయ్యాయి.
You may be interested
లాంగ్ టర్మ్.. బుల్లిష్..
Thursday 16th August 2018దీర్ఘకాలంలో మార్కెట్లు బుల్లిష్‌గా ఉంటాయని యూఎన్ జాయింట్ స్టాఫ్ సెన్షన్ ఫండ్ సెక్రటరీ జనరల్ సుధీర్ రాజ్‌కుమార్ తెలిపారు. టెక్నాలజీ రంగంలోని బలమైన వృద్ధి దీనికి దోహదపడనుందని పేర్కొన్నారు. అమెరికా ఫెడ్ రేట్ల పెంపు ఎక్కువ ప్రభావం చూపబోదని తెలిపారు. రానున్న కాలంలో ఎలాంటి అవరోధాలున్నా.. మార్కెట్లు వాటిని అధిగమిస్తాయని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, ఫెడరల్ రిజర్వు రేట్ల పెంపు అంశాల కారణంగా మార్కెట్లపై
రాజకీయ పరిస్థితుల రిస్క్‌పై ఆందోళన లేదు
Thursday 16th August 2018ఇటీవలి కరెక్షన్ తర్వాత మార్కెట్ రేంజ్ బౌండ్ అయ్యిందన్నారు జీటీఐ క్యాపిటల్ గ్రూప్‌కు చెందిన మాధవ్ ధర్. టర్కీస్ లిరా సంక్షోభం, అమెరికా డాలర్ బలోపేతం వంటి అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ నిఫ్టీ 11,400 మార్క్‌కు పైన స్థిరపడిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుందనే భావంతో అమెరికాలో రేట్ల పెంపు జరుగుతోందని తెలిపారు. ప్రస్తుత వడ్డీ రేటు చక్రం.. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లకు సమకాలికంగా లేదని, అయితే ప్రసుత్త పరిస్థితులు 1994 మెక్సికన్