నష్టాల్లో అడాగ్ షేర్లు
By Sakshi

ముంబై:- ఆటుపోట్ల మధ్య సాగుతున్న మార్కెట్లో అనిల్ అంబానీ ధీరూభాయ్ గ్రూప్(అడాగ్) షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. అడాగ్ షేర్లలో భారీ స్థాయిలో అమ్మకాలు చేపట్టారు. ఫలితంగా గురువారం అడాగ్ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ క్యాపిటల్ షేరు ఏడాది కనిష్టానికి పతనమైంది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 5శాతానికి పైగా నష్టపోయింది.
ఏడాది కనిష్టానికి రిలయన్స్ క్యాపిటల్:- నేటి బీఎస్ఈ ట్రేడింగ్‌లో రూ.318.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సంస్థకు 10ఏళ్ల పాటు సీఈవో, ఈడీగా సేవలు అందించిన దేవాంగ్ మూడీ వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం స్టాక్ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రతికూలాంశంతో ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 7శాతం క్షీణించి రూ. 297.95ల వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.318.75)తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.297ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్‌లో టాప్ లూజర్‌గా ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.295.25 రూ.638.00లుగా నమోదయ్యాయి.
రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్:- నేడు బీఎస్ఈలో రూ.323.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.305.05ల ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.321)తో పోలిస్తే 3.74శాతం నష్టంతో రూ.309.00ల వద్ద ట్రేడ్ అవుతోంది. షేరు ఏడాది కనిస్ట ధరలు వరుసగా రూ. 304.00 రూ.589.80లుగా నమోదయ్యాయి.
You may be interested
కొనసాగుతున్న బ్యాంక్ నిఫ్టీ పతనం
Thursday 27th September 2018మార్కెట్ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంకు నిఫ్టీ సూచి గురువారం నష్టాల బాట పట్టింది. నేడు 25,442ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు అమ్మకాలు కారణంగా 0.83శాతం నష్టపోయి 25163 కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్ గతముగింపు(25376)తో పోలిస్తే 0.75శాతం నష్టపోయి 25,186 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయానికి సూచీలో భాగమైన మొత్తం 12షేర్లలో 10 షేర్లు నష్టాల్లో కొసాగుతుండగా, ఎస్బీఐ షేరు(1.50శాతం), హెచ్డీఎఫ్సీ బ్యాంకు
మార్కెట్లో అప్రమత్తత అవసరం.. ఎందుకంటే!
Thursday 27th September 2018ఈ నెలారంభంలో నిఫ్టీ 12 నెలల ఫార్వర్డ్ పీఈకి 20 రెట్ల వద్ద ట్రేడవుతోంది. మూడేళ్ల సరాసరితో పోలిస్తే ఇది 15 శాతం అధికం. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు జరిపే అధ్యయనంలో ఫార్వర్డ్ పీఈ ప్రైస్ చాలా కీలకం. గతంలో సూచీలు 12నెలల ఫార్వర్డ్ పీఈకి 18 రెట్లు అధికంగా ట్రేడయిన సందర్భాల్లో అధిక శాతం కరెక్షన్కు గురైందని గోల్డ్‌మన్ సాక్స్ అధ్యయనం వెల్లడించింది. ఉదాహరణకు ఎంఎస్సీఐ ఇండియా సూచీ