STOCKS

News


ఎస్‌బీఐ, రిలయన్స్‌ షేర్లను చూడొచ్చు..!

Saturday 17th November 2018
Markets_main1542452254.png-22151

  • మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్‌ ప్రెసిడెంట్‌ యోగేష్ మెహతా సిఫార్సు

ముంబై: గడిచిన 15 రోజుల్లో నిఫ్టీ 4-5 శాతం మేర లాభపడగా.. ఇంత తక్కువ సమయంలో మార్కెట్‌ రికవరీ సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని యోగేష్ మెహతా అన్నారు. ఆ సమయంలో ముడిచమురు ధరలు గరిష్టస్థాయిల వద్ద ఉండడం వల్ల ఈమేర రికవరీ ఉంటుందని ఎవరూ భావించలేదని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుతం ముడిచమురు ధరలు భారీగా పతనమై భారత ఆర్థిక వ్యవస్థకు, మార్కెట్‌కు సానుకూలంగా మారినట్లు విశ్లేషించారు. ఎర్నింగ్స్‌ తరువాత ఎన్‌ఎస్‌ఈ ఈపీఎస్‌లో మహాఅయితే 3-4 శాతం తగ్గుదల ఉందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. వృద్ధిరేటు 13-14 శాతం ఉండవచ్చని అంచనావేశారు. ప్రస్తుత ఏడాది పీఈ మల్టీపుల్స్‌ 20-20.5 రెట్లుగా తెలిపారు. నవంబర్‌ 19న మొదలయ్యే వారం రోజుల ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ, రిలయన్స్‌ షేర్లు విజేతలుగా మారే అవకాశం ఉందని సిఫార్సుచేశారు. ముడిచమురు ధరలు తగ్గడం వల్ల జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ షేర్లలో రిలీఫ్‌ ఉండవచ్చన్నారు.



You may be interested

ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించేసిన స్టాక్స్‌

Sunday 18th November 2018

ఇన్వెస్టర్లు రాబడుల కాంక్షతో స్టాక్‌ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్‌ చేయడానికి మొగ్గుచూపుతుంటారు. ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీ పనితీరుపై నిత్యం కన్నేసి ఉంచి, అవసరమైతే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే రాబడులకు, పెట్టుబడి రక్షణకు అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. లేదంటే ఇన్వెస్టర్లు నిండా నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. కుబేరులను చేసిన షేర్లే కాదు... నిండా ముంచేసినవీ కూడా స్టాక్‌ మార్కెట్లో ఉన్నాయి. గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను

ట్రేడింగ్‌ మెంబర్లకు బీఎస్‌ఈ ప్రోత్సాహకాలు

Saturday 17th November 2018

ముంబై: నాన్‌-కాంపిటీటేవ్‌ బిడ్డింగ్స్‌లో రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంలో భాగంగా బొంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ పలు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. ప్రభుత్వ సెక్యూరిటీలు, టి-బిల్స్‌ (ట్రెజరీ బిల్లులు) వంటి విభాగాల్లో నవంబర్‌ 19 నుంచి ట్రేడింగ్‌ మెంబర్లకు పలు ప్రోత్సాహకాలు ఉండనున్నట్లు తెలిపింది. తొలుత ఆరు నెలలు కొనసాగే ఈ స్కీంలో వసూలు చేసిన మొత్తం, క్లైంట్ల సంఖ్య ఆధారంగా ప్రోత్సాహకాలు ఉంటాయని వెల్లడించింది. ఇక ఈ ఏప్రిల్‌

Most from this category