STOCKS

News


రాఫెల్‌ డీల్‌ పిటిషన్ల కొట్టివేత: అడాగ్‌ షేర్ల ర్యాలీ

Friday 14th December 2018
Markets_main1544768342.png-22930

వివాదస్పద రాఫెల్ ఒప్పందంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో శుక్రవారం అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్లు లాభాల బాట పట్టాయి. దేశ రక్షణార్థం 2015 ఏప్రిల్‌  ఫ్రాన్స్‌ సంస్థ రాఫెల్‌ నుంచి నుంచి 36 యుద్ధ విమానాలను రూ.58వేల కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోది ప్రకటించారు. అందులో భాగంగా రాఫెల్‌ తమ భారత భాగస్వామిగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్‌ను ఎంచుకుంది. దివాలా తీసిన అనిల్ అంబానీకి మేలు చేయడంకోసమే ప్రధాని మోదీ రాఫెల్‌ ఒప్పంద భాగస్వామిగా చేరుకున్నట్లు విపక్షాలు ఆరోపించాయి. ఈ వివాదస్పద ఒప్పందంపై సమగ్ర దర్యాప్తు జరపాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తో పాటు కొద్దిమంది సుప్రీం కోర్టులో పిటిషన్లు ధాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు దేశ రక్షణకు సంబంధించిన రాఫెల్‌ ఒప్పందంలో తాము జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. జెట్ ధరల అంశాన్ని నిపుణుల కమిటీ చూసుకుంటుందని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఉదంతంలో కీలక ప్రతివాదిగా ఉన్న అనిల్‌ అంబానీ కంపెనీకి పిటిషన్ల కొట్టివేతతో ఊరట లభించినట్లైంది. ఫలితంగా శుక్రవారం రిలయన్స్‌ అనిల్‌ అంబానీ గ్రూప్‌ షేర్లైన రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌ షేర్లు 7శాతం నుంచి 1శాతం వరకూ  లాభపడ్డాయి.
రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.287.00ల వద్ద ప్రారంభమైంది. 7.5శాతం లాభపడి రూ.312.00ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.286.95)తో పోలిస్తే 4.50శాతం లాభపడి రూ.299.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
రిలయన్స్‌ పవర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.28.00ల వద్ద ప్రారంభమైంది. 3.50శాతం లాభపడి రూ.29.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.28.05)తో పోలిస్తే 2.50శాతం లాభపడి రూ.28.75ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.15.05ల వద్ద ప్రారంభమైంది. 2.50శాతం లాభపడి రూ.16.05ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.15.40)తో పోలిస్తే 1శాతం లాభపడి రూ.15.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఇండియన్‌ ఎకానమీ టేకాఫ్‌కు రెడీ: ఝున్‌ఝున్‌వాలా

Friday 14th December 2018

దిగ్గజ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా తాజాగా మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోని వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికలను 2019 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించడం లేదన్నారు. అయితే అధికారంలోకి ఎవ్వరొచ్చిన ప్రమాదమేమీ లేదని, భారత్‌ గొప్ప ప్రజాస్వామ్య దేశమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మిడ్‌ క్యాప్స్‌ బాగా కరెక‌్షన్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. లార్జ్‌ క్యాప్‌ కంపెనీల

ప్రైవేటు బ్యాంకులు భారతీయుల చేతుల్లోనే ఉండాలి

Friday 14th December 2018

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకుల యాజమాన్యం భారతీయుల చేతుల్లోనే ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) అభిప్రాయపడింది. ఈ సంస్థ ‘భారత్‌లో బ్యాంకుల భవిష్యత్తు’ పేరుతో ఢిల్లీలో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించింది. అనంతరం విడుదల చేసిన చర్చా పత్రంలో... ‘‘ప్రైవేటు బ్యాంకుల యాజమాన్యం విషయంలో నియంత్రణపరమైన కార్యాచరణను ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ సమీక్షించాల్సిన అవసరం ఉంది. మనలో ఎవరూ కూడా దేశీయ బ్యాంకులు విదేశీ సంస్థల

Most from this category