News


ఏడాది కనిష్టాలకు ఆర్‌ క్యాప్‌, ఆర్‌హోమ్‌ఫైనాన్స్‌

Friday 14th June 2019
Markets_main1560490734.png-26281

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం 52 వారాల కనిష్ఠాలకు చేరాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ 7శాతం నష్టంతో రూ.78.10 వద్ద ట్రేడవుతోంది.  రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ నాలుగు శాతం నష్టంతో రూ.14.30 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌ కాపిటల్, రిలయన్స్‌ హోం, ఫైనాన్‌ కంపెనీలకు ఆడిటింగ్‌ సేవలందించే పీడబ్యూసీ అకస్మాత్తుగా ఆ సేవల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దృష్ఠి సారిస్తామని సెబి, కార్పోరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించాయి. దీనితో పాటు ఈ మూడు కంపెనీల మధ్య జరిగిన లావాదేవిల విషయాలను  సేకరించమని  స్టాక్‌ ఎక్సెంజ్‌ను కార్పోరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరడంతో  వరుసగా మూడవ సెషన్‌లో కూడా వీటి షేరు విలువ పడిపోయింది.  ఈ కంపెనీల లావాదేవీల్లో అవకతవకలున్నాయని పీడబ్ల్యుసీ తప్పుకుంటూ కార్పొరేట్‌ మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. అయితే ఆడిటింగ్‌ సంస్థ ఆరోపణలు అవాస్తవాలని ఆర్‌క్యాప్‌ విమర్శించింది.



You may be interested

14నెలల గరిష్టం వద్ద పసిడి ధర

Friday 14th June 2019

పసిడి ధర శుక్రవారం 14నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ రాజకీయ ఉద్రికత్తలు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత అంచనాలు పసిడి ర్యాలీకి ఊతమిస్తున్నాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర డాలర్లు లాభపడి 1,348.85డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న గల్ఫ్‌ ఒమన్‌ ప్రాంతంలో గురువారం రెం‍డు చమురునౌకలపై గుర్తు తెలియని దుండగలు దాడి చేయడంతో మధ్య ప్రా‍చ్యదేశాల్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.

రూపీ 11పైసలు డౌన్‌

Friday 14th June 2019

 శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి 69.61 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన ముడిచమురు ధరలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పై ప్రభావం చూపాయి.  రూపీ ఆరంభమే బలహీనంగా 69.55 వద్ద మొదలైంది. గురువారం రూపీ 69.50 వద్ద క్లోజయింది. యూఎస్‌ ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో రూపీ స్వల్ప శ్రేణిలో ట్రేడవుతోందని నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయ కరెన్సీలతో

Most from this category