STOCKS

News


మళ్లీ రికార్డు ప్రారంభం

Wednesday 1st August 2018
Markets_main1533095907.png-18817

వరుస రికార్డులతో దూసుకుపోతున్న భారత్‌ మార్కెట్‌ బుధవారం తిరిగి లాభాలతోనే ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంతో 37.644 పాయింట్ల వద్ద మొదలై 37,665 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,375  పాయింట్ల వద్ద కొత్త రికార్డు సృష్టించింది. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై 10 శాతం సుంకం విధింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీచేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నిస్తేజంగా ట్రేడవుతున్నప్పటికీ, భారత్‌ సూచీలు మరో కొత్త రికార్డుస్థాయి వద్ద ప్రారంభంకావడం విశేషం. గత రాత్రి క్రూడ్‌ ధర 2 శాతంపైగా క్షీణించడం, రూపాయి విలువ బలపడటం కూడా ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చినట్లు విశ్లేషకులు చెపుతున్నారు. 
పెట్రో షేర్లు అప్‌
గత రాత్రి ముడి చమురు ధరలు 2 శాతంపైగా తగ్గిన నేపథ్యంలో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీలు 2 శాతం వరకూ ప్రారంభంలో లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, వేదాంతాలు సైతం 1–2 శాతం లాభంతో మొదలయ్యాయి. ఫలితాల ప్రభావంతో టాటా మోటార్స్‌ 3 శాతంపైగా నష్టంతో ప్రారంభంకాగా, ఇండియాబుల్స్‌ హౌసింగ్, టెక్‌ మహింద్రాలు 1 శాతంవరకూ నష్టాలతో మొదలయ్యాయి.


 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 1st August 2018

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌:- ఇండియన్‌ రైల్వే నుంచి రూ.2,500 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. అందులో భాగంగా ఇండియన్‌ రైల్వేలకు లక్ష టన్నుల రైలు పట్టాలను సప్లై చేయాల్సి ఉంటుంది. తేజాస్‌ నెట్‌వర్క్స్‌:- అల్జీరియా దేశానికి చెందిన ఐసీఓఎస్‌నెట్‌ సంస్థ తన దేశంలో హై-స్పీడ్‌ యాక్సిక్‌, వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్స్‌ తదితర సాఫ్ట్‌వేర్‌ సేవలకు కొరుకు తేజాస్‌ నెట్‌వర్క్స్‌

రేట్లు పెంచితే పెద్ద తప్పు చేసినట్లే!

Tuesday 31st July 2018

వడ్డీరేట్లపై మార్క్‌మొబియస్‌ అభిప్రాయం ఈ వారం జరిగే పరపతి సమీక్షా సమావేశంలో రేట్లు పెంచడం జరిగితే ఆది ఆర్‌బీఐ చేసే ‘అతిపెద్ద తప్పు’ అవుతుందని ప్రముఖ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అభివర్ణించారు. ఒకపక్క ఎక్కువ మంది అనలిస్టులు ఆర్‌బీఐ ఈ దఫా రేట్లు పెంచుతుందని అంచనాలు వేస్తున్నారు. కానీ మొబియస్‌ మాత్రం భిన్నంగా స్పందించారు. బ్లూమ్‌బర్గ్‌ సర్వేలో దాదాపు అందరు ఎకనమిస్టులు ఈ దఫా ఆర్‌బీఐ పావు శాతం మేర రేట్లు

Most from this category