STOCKS

News


కొనసాగిన రికార్డుల పరంపర

Tuesday 28th August 2018
Markets_main1535453078.png-19731

  • 11700 పైన ముగిసిన నిఫ్టీ
  • 39000ల చేరువలో సెన్సెక్స్‌

మార్కెట్‌లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. ట్రేడింగ్‌ ఆద్యంతం దూకుడును ప్రదర్శించిన సూచీలు చివరకు ఆల్‌టైం రికార్డుల్లో స్థిరపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల పవనాలకు తోడు, హెవీ వెయిట్‌ షేర్లైన  రిలయన్స్‌ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మారుతి, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ, మెటల్‌ షేర్ల అండతో సూచీలు మంగళవారం మరోకొత్త రికార్డు వద్ద ముగిశాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 202 పాయింట్ల లాభంతో 38,896 వద్ద, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 11,738 వద్ద ముగిశాయి. కాగా ఇవి సూచీలకు కొత్త ముగింపు రికార్డులు కావడం విశేషం. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ సూచి, ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సూచీ, అటో, ఐటీ సూచీ, ప్రవేట్‌ రంగ బ్యాంకు, నిఫ్టీ బ్యాంకు సూచీలు లాభపడగా, ప్రభుత్వం రంగ బ్యాంకు, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచీ 38760-38939 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నిప్టీ సూచీ 11,710- 11,760.20 పాయింట్ల స్థాయిలో కదలాడింది.   
ట్రేడింగ్‌ ఆద్యంత లాభాల్లోనే:-
ఆసియా మార్కెట్ల నుంచి అందిన ప్రభావంతో ఈ ఉదయం దేశీయ సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. సెన్సెక్స్‌ 121 పాయింట్ల లాభంతో 38,815 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 11,732 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన కాసేపటికి బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న లాభాల స్వీకరణతో సూచీలు స్వల్పంగా ఆరంభలాభాలను కోల్పోయాయి. అయినప్పటికీ, మిగితా అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీలు స్థిరమైన ర్యాలీచేశాయి. అనంతరం ఇన్వెస్టర్ల​ కొనుగోళ్ల అండతో సూచీలు అంతకంతకు ఎగబాకి కొత్త రికార్డులు సాధించాయి. హెవీ వెయిట్‌ షేర్లైన  రిలయన్స్‌ ఇండస్ట్రీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, మారుతి, టీసీఎస్‌ షేర్ల ర్యాలీ నేటి మార్కెట్‌ను ముందుండి నడిపించదని చెప్పువచ్చు. సెన్సెక్స్‌ 200 పాయింట్ల పైగా లాభపడగా..నిఫ్టీ 11750 మైలురాయిని తాకింది. మిడ్‌ సెషన్‌ అనంతరం ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు తోడు, యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం మన మార్కెట్‌ మరింత ఉత్సాహానిచ్చాయి. ఫలితంగా నిఫ్టీ సూచీ 11,760 వద్ద, సెన్సెక్స్‌ 38939 వద్ద తమ కొత్త జీవితకాల గరిష్టాలను నమోదుచేశాయి.
హిందూస్తాన్‌ యూనిలివర్‌, హెచ్‌పీసీఎల్‌, సిప్లా, యస్‌ బ్యాంకు, గెయిల్‌ షేర్లు 1నుంచి 4.50శాతం నష్టపోగా, మారుతి, వేదాంత, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, అదానీ పవర్‌, హిందాల్కో షేర్లు 2నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 29th August 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:40 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో 11,746 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో సోమవారం నాటి ముగింపు 11,705 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ బుధవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు చైనా మినహా

యాక్సిస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌పై ఉదయ్‌ కోటక్‌ కన్ను?!

Tuesday 28th August 2018

ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ త్వరలో యాక్సిస్‌ బ్యాంక్‌ లేదా పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ల్లో వాటాలు కొనుగోలు చేయబోతున్నారా? అవునంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. కోటక్‌ మహీంద్రా బ్యాంకులో వాటాను 20 శాతానికి లోపు తగ్గించుకోవాలని ఆర్బీఐ ఇటీవల ఉదయ్‌ కోటక్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఫ్రిఫరెన్షియల్‌ షేర్‌ సేల్‌ చేసేందుకు ఆర్‌బీఐ అంగీకరించలేదు. అందువల్ల ఈ మొత్తంతో కొత్తగా ఒక విత్త సంస్థను సొంతం చేసుకోవాలని(అక్విజిషన్‌) ఉదయ్‌ భావిస్తున్నట్లు

Most from this category