STOCKS

News


రీబౌన్స్‌ ఉంటుందా?

Saturday 6th October 2018
Markets_main1538819914.png-20928

ఈ వారం బుల్స్‌కు పీడకలగా మిగిలిపోనుంది. కేవలం బుల్స్‌కు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి, నియంత్రణా సంస్థలకు సైతం ఈ వారం చేదు అనుభవాలను మిగిల్చింది. రూపీ పతనాన్ని, క్రూడాయిల్‌ ప్రభావాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ, సెబి పలు యత్నాలు చేశాయి. అయితే వారాంతానికి అవన్నీ ప్రయోజనం చేకూర్చకుండా పోయాయి. రూపాయి 74 స్థాయిని తాకింది. నిఫ్టీ 10400 పాయింట్లను సైతం కోల్పోయింది. అయితే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు కొత్త బోర్డు ఏర్పాటు, ఓఎంసీలకు ప్రత్యేక విండో, వడ్డీరేట్లను యథాతధంగా ఉంచడం లాంటి చర్యలు క్రమంగా ఫలితాన్నిస్తాయని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే వారం సూచీల్లో రీబౌన్స్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్రూడాయిల్‌ చార్టుల్లో ఎంగల్ఫింగ్‌ బేర్‌ పాటర్న్‌ ఏర్పడడం విశేషం. దీంతో త్వరలో ముడిచమురు ధరలో భారీ కరెక‌్షన్‌ ఉండొచ్చని అంచనా. ఇవన్నీ కలగలిపి దేశీయ సూచీలను కోలుకునేలా చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డబ్ల్యుటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 74 డాలర్ల దిగువకు వస్తే కరెక‌్షన్‌ ఖాయం చేసుకోవచ్చంటున్నారు. 
టెక్నికల్‌గా కూడా సూచీలు అత్యంత ఓవర్‌సోల్డ్‌లో ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల ఒక షార్‌‍్ప బౌన్స్‌ బ్యాక్‌ తప్పక ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎంపిక చేసిన కాల్స్‌, లాంగ్స్‌ తీసుకొని జాగ్రత్తగా ట్రేడ్‌ చేయవచ్చని సూచిస్తున్నారు. సూచీలు, స్టాకుల వాల్యూషన్లు గరిష్ఠాల నుంచి దిగివచ్చినందున పతనానికి అడ్డుకట్టపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎర్నింగ్స్‌ సీజన్‌ ఆరంభమైతే రికవరీ మరింత ఊపందుకుంటుంది. 



You may be interested

ఓఎంసీలు ఇంకా బలహీనమే!

Saturday 6th October 2018

మానస్‌ జైస్వాల్‌ చమురు మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు ఇంకా బలహీనంగా కనిపిస్తున్నాయని మార్కెట్‌ నిపుణుడు మానస్‌ జైస్వాల్‌ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తాజాగా ఈ కంపెనీలపై పెట్రో భారం మోపడంతో రెండు రోజుల్లో ఈ షేర్లు దాదాపు 35 శాతం వరకు పతనమయ్యాయి. అయితే ఈ కరెక‌్షన్‌ ఇంకా ముగిసిపోలేదని, మరో 10- 15 శాతం వరకు పతనం ఉండొచ్చని మానస్‌ చెప్పారు. ఈ కంపెనీల్లో కొత్తగా లాంగ్స్‌ తీసుకోవాలంటే మరి కొంత

బిజినెస్‌ వీక్లి రౌండప్‌

Saturday 6th October 2018

♦ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి ఈ వారంలో ఈ ఏడాది లాభాలన్నీ కరిగిపోయాయి. 2016 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. బ్రెంట్‌ ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 5.11 శాతం క్షీణతతో 34,377 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 ఇండెక్స్‌ 5.62 శాతం క్షీణతతో 10,316 పాయింట్లకు పడిపోయాయి. ♦ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి తొలిసారిగా 74 మార్క్‌ దిగువకు పతనమైంది.

Most from this category