STOCKS

News


థైరోకేర్‌ షేర్ల బైబ్యాక్‌ వెనుక కారణం?

Wednesday 12th September 2018
Markets_main1536691540.png-20170

రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించే ప్రముఖ సంస్థ  థైరోకేర్‌ టెక్నాలజీస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును గరిష్టంగా రూ.730 వరకు చెల్లించి కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.63 కోట్లను కేటాయించింది. 8,63,013 షేర్ల వరకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఈ బైబ్యాక్‌కు కారణాల గురించి కంపెనీ సీఎండీ, సీఈవో ఏ వేలుమణి ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

 

ఓపెన్‌ ఆఫర్‌కు కారణం?
మూడు అంశాలున్నాయి. మొదటి డివిడెండ్‌. డివిడెండ్‌ రూపంలో 30 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. లాభాలు బయటకు పంపించే ఖరీదైన మార్గం ఇది. రెండో అంశం స్టాక్‌ ధర గత మూడు నెలల కాలంలో చాలా తక్కువ స్థాయి వద్దకు వచ్చి ఉంది. కనుక షేర్ల బైబ్యాక్‌కు ఇది సరైన సమయం అని భావిస్తున్నాం. మూడో అంశం మిగులు నిల్వలను వినియోగించేందుకు మెరుగైన మార్గం మరేదీ లేదు. కనుక బైబ్యాక్‌ అన్నది మెరుగైనదిగా భావించి ముందుకు వెళుతున్నాం. 

 

ప్రమోటర్లు పాల్గొంటున్నారా..?
ప్రమోటర్లను బైబ్యాక్‌ ఆఫర్‌లో పాల్గొనేందుకు అనుమతించడం లేదు. కంపెనీ ఎంచుకున్న మార్గం థర్డ్‌ పార్టీ నుంచి కొనుగోలు చేయడమే. ఏటా రూ.100 కోట్లతో బ్యాలన్స్‌ షీటు ఉంటోంది. వ్యాపార అవసరాల కోసం రూ.25-30 కోట్లు చాలు. మొత్తం నిధులను వెచ్చించలేం. కనుక డివిడెండ్‌ ప్రకటించడం లేదా మూలధన నిధుల వ్యయం చేయడం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. డివిడెండ్‌ విషయంలో ఖర్చులను భరించాల్సి ఉంటుంది. కనుక 60 శాతం నిధులను బైబ్యాక్‌ కోసం వినియోగించి, మిగిలిన 40 శాతం నిధులను వ్యాపార అవసరాలకు కేటాయించనున్నాం. 

 

మధ్య మధ్యలో బైబ్యాక్‌ ఉంటుందా?
ఇప్పుడే అంచనా వేయడం కష్టమే. బైబ్యాక్‌ చేయాలని ఇప్పుడు భావిస్తున్నాం. వ్యాపార విస్తరణకు నిధుల అవసరం లేకపోతే  తదుపరి విడత బైబ్యాక్‌ చేస్తాం. కాకపోతే దీనిపై ఇప్పుడే నిర్ణయించుకోం. 

 

ఎంత మేర నిధుల వ్యయాల అవసరం ఉంది?
ఈ ఏడాది మార్చిలో రూ.350 కోట్లు వ్యయం చేశాం. 42 శాతం ఎబిట్డా ఉంది. డిప్రీసియేషన్‌ లేదా వడ్డీ పెద్దగా ఉండదు. దాంతో పన్ను అనంతర లాభం రూ.90 కోట్లు వస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతున్న క్రమంలో ఇది కూడా పెరుగుతుంది. అంటే వ్యాపారం 20 శాతం వృద్ధి చెందితే లాభం కూడా 20 శాతం మేర పెరగుతుంది. వచ్చే మూడేళ్లలో పన్ను అనంతర లాభం రూ.400 కోట్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నాం.



You may be interested

ఈ రెండు స్టాక్స్‌పై ఫండ్స్‌లో ఎంతో ఆసక్తి

Wednesday 12th September 2018

మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు వేలాది స్టాక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు ఎన్నో అంశాలను పరిశోధించి, అధ్యయనం చేసిన తర్వాత, వృద్ధి అవకాశాల ఆధారంగానే స్టాక్స్‌ ఎంపిక చేస్తుంటారు. మరి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఓ రెండు స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పట్ల ఎంతో నమ్మకం ప్రదర్శిస్తున్నాయంటే, ఆ కంపెనీల్లో వృద్ధి సామర్థ్యాలు దండిగా ఉన్నాయనే భావించాల్సి ఉంటుంది. అవి డిక్సన్‌ టెక్నాలజీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌. ఫండ్స్‌ మేనేజర్లు, బ్రోకరేజీలు

సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌

Tuesday 11th September 2018

  11300 దిగువకు నిఫ్టీ నెలరోజుల కనిష్టానికి సూచీలు ముంబై:- రూపాయి పతనం... మార్కెట్‌ను రెండో రోజూ ముంచింది. మార్కెట్‌ మరో అరగంటలో ముగుస్తుందనగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 29 పైసలు నష్టపోయి 72.74 వద్ద కొత్త కనిష్టానికి పతనమైంది. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరగడం, వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో ట్రేడింగ్‌ చివరి గంటలో మార్కెట్‌లో హఠాత్తుగా అమ్మకాల సునామి వెల్లువెత్తింది. ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ,

Most from this category