News


షేర్లు ఇంతలా పడిపోవడానికి కారణం అదేనా...?

Friday 15th February 2019
Markets_main1550169432.png-24204

ప్రధాన సూచీలు ఓ పరిమిత శ్రేణిలోనే ప్రయాణం సాగిస్తుంటే... మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ప్రతీ రోజూ నేల చూపులు చూస్తున్నాయి. ఎప్పటికప్పుడు నూతన కనిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. ఈ పతనం ఎంతవరకు...? అన్న భయం రిటైల్‌ ఇన్వెస్టర్లలో నెలకొంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ చాలా ఆకర్షణీయ ధరలకు వచ్చేశాయని, వీటిల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చంటూ పలువురు విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థలు సూచిస్తున్నాయి. మరి ఎందుకని ఈ విధంగా షేర్లు ఊహించనంత పతనాన్ని చవి చూస్తున్నాయి...? వెంటనే రివకరీ రావడం లేదని ఎందుకు..? అని ప్రశ్నించుకుంటే... సమాధానం కోసం దీని వెనుక ఉన్న నిధుల కోణాన్ని అర్థం చేసుకోవాల్సిందే. కంపెనీల ప్రమోటర్లకు, ఆపరేట్లకు మధ్య ఉన్న అనుబంధాన్నీ తెలుసుకోవాల్సిందే.

 

ప్రమోటర్లు నడిపించే ఆపరేటర్లే ప్రస్తుత షేర్ల విలువల పతనానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆపరేటర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసేందుకు గాను ప్రమోటర్ల వద్ద నిధుల్లేకపోవడమే సమస్యకు మూలం. ఈ ఏడాది ఆరంభం నుంచి బీఎస్‌ఈ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 9 శాతం మేర నష్టపోయాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) తమ డెట్‌ నిధుల నుంచి కంపెనీల ప్రమోటర్లకు రుణాలిస్తుంటాయి. క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్స్‌ కింద ఈ లావాదేవీలు నిర్వహిస్తుంటాయి. అయితే, ఇటీవలి ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం అనంతరం లిక్విడిటీ కొరత కారణంగా కంపెనీల ప్రమోటర్లకు నిధులను సర్దుబాటు చేయడాన్ని ఏఎంసీలు దాదాపుగా తగ్గించేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో చాలా వరకు ఆపరేటెడ్‌ స్టాక్స్‌ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నాయని పేర్కొంటున్నారు. ‘‘మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి సమీకరించిన నిధులను ప్రమోటర్లు... ఆపరేట్లకు సర్దుబాటు చేసేశారు. ఈ నిధులతో కంపెనీల షేర్ల ధరలు నిలబడేలా చేయడం ఆపరేట్ల పని. నిధులకు సమస్య ఏర్పడడంతో ఈ సమయంలో పెద్ద కొనుగోలు దారుడైన ఆపరేటర్‌ అచేతనంగా మారినట్టు’’ క్యాపిటల్‌మైండ్‌ సీఈవో దీపక్‌ షెనాయ్‌ తెలిపారు. ఈ చీకటి లిక్విడిటీ బయటకు వెళ్లిపోతే, సరైన నిధుల ప్రవాహం వస్తుందని, ఈ మధ్యలో షేర్ల ధరల పతనానికి కారణం ఏదీ ఉండదని చెప్పారు. 

 

వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ అధినేత ధీరేంద్ర కుమార్‌ సైతం మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ప్రమోటర్లకు నిధుల ప్రవాహం తగ్గిపోయినట్టు తెలిపారు. గడిచిన కొన్ని వారాల్లో కొన్ని స్టాక్స్‌ ఏకంగా ఇంట్రాడేలో 15-20 శాతం మేర పడిపోయాయి. ఎటువంటి ప్రకటనలు లేకుండానే ఇది చోటు చేసుకోవడం గమనార్హం. కొన్ని కేసుల్లో ప్రమోటర్లు వాటాలను తనఖా పెట్టగా, కొన్ని కేసుల్లో ఈ తనఖా చాలా తక్కువగానే ఉంది. ఈ కౌంటర్లలో ఆపరేటర్లు షేర్లను అమ్మేయడమే ధరల పతనానికి కారణంగా మార్కెట్‌ పార్టిసిపెంట్స్‌ చెబుతున్నారు. ‘‘వ్యవస్థలో నిదుల లభ్యత సమస్య నెలకొనడంతో చాలా వరకు ప్రమోటర్లు ఆపరేటర్లు/ బ్రోకర్లకు టాప్‌ అప్‌ ఫండ్స్‌ను సమకూర్చడంలో విఫలమవుతున్నారు. మరిన్ని షేర్లను సరఫరా చేసే స్థితిలోనూ లేరు. ఎందుకంటే చాలా వరకు తనఖా పెట్టడం లేదా ఆపరేటర్లకు బినామీ ఖాతాల ద్వారా బదిలీ చేయడమే కారణం’’ అని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ అంబరీష్‌ బలిగా పేర్కొన్నారు.You may be interested

నష్టాల ప్రారంభం

Friday 15th February 2019

ప్రపంచమార్కెట్ల నుంచి బలహీన సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ శుక్రవారం మరోసారి నష్టాలతో ప్రారంభమైంది. ఇటీవల మార్కెట్లో నెలకొన్న అస్థితర వాతావరణ సూచీల ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రూపాయి పతనంతో ఐటీ షేర్ల తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అ‍త్యధికంగా ఫార్మా షేర్లలో విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో షేర్ల సైతం నష్టాల బాట పట్టాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 65

పీఎస్‌యూ కంపెనీలపై మ్యూచువల్‌ ఫండ్స్‌ ‘లవ్‌’

Friday 15th February 2019

దేశంలో టాప్‌ -3 మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) జనవరిలో పలు పీఎస్‌యూ కంపెనీల షేర్లను కొనుగోలు చేశాయి. ఈ మూడు సంస్థల నిర్వహణలో ఉన్న ఈక్విటీ, డెట్‌ ఆస్తులు విలువ రూ.9 లక్షల కోట్లు. మరి ఉన్నట్టుండి ప్రభుత్వరంగ కంపెనీల్లో షాపింగ్‌ ఎందుకు చేసినట్టు? అన్న సందేహం ఇన్వెస్టర్లకు రావడం సహజం. పీఎస్‌యూ షేర్ల వ్యాల్యూషన్లు చాలా తక్కువ స్థాయికి అందుబాటులోకి రావడాన్ని ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సి

Most from this category