STOCKS

News


రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Thursday 1st November 2018
Markets_main1541057780.png-21636

ఆరంభలాభాలను కోల్పోయి సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే రియల్టీరంగ షేర్లు మాత్రం మార్కెట్‌ దృక్పథానికి విభిన్నంగా స్పందిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని కీలక సూచీలన్నీంటిలోకి నిఫ్టీ రియల్టీ సూచీ నేటి ట్రేడింగ్‌లో అత్యధికంగా 3శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.12:30లకు ఇండెక్స్‌ గతముగింపు(214.90)తో పోలిస్తే 2శాతం లాభంతో 219ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఈ సూచీలో భాగమైన 10షేర్లకు గానూ మొత్తం షేర్లన్నీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా ఇండియాబుల్‌రియల్‌ఎస్టేట్‌ 5శాతం లాభపడింది. యూనిటెక్‌, డీఎల్‌ఎఫ్‌ 4.50శాతం, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 4శాతం పెరిగాయి. ఓబేరాయ్‌ రియల్టీ, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2 శాతం, శోభ లిమిటెడ్‌ 1శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీ, సన్‌టెక్‌, ప్రిస్టేజ్‌ ఎస్టేజ్‌ అరశాతం చొప్పున లాభపడ్డాయి.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే ఉదయం లభించి లాభాల ట్రేడింగ్‌ను కొనసాగించడంలో సూచీలు విఫలమయ్యాయి. ఫలితంగా గం.12:30లకు బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 92 పాయింట్ల నష్టంతో 34350ల వద్ద నిఫ్టీ సూచి 20 పాయింట్ల నష్టంతో 10,374 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ముహూరత్‌ ట్రేడింగ్ టాప్‌ పిక్స్‌ ఇవే..

Thursday 1st November 2018

- దీపావళి రోజున 5 షేర్లను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసిన దీపాన్ మెహతా - థామస్ కుక్, క్యాపిటల్ ఫస్ట్, డెల్టా కార్ప్, టాటా ఎలాక్సీ, జుబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ కొనుగోలు చేయవచ్చని సిఫార్సు ముంబై: స్థూల ఆర్థిక అంశాలు గాడిలోపడి, రాజకీయ అనిశ్చితులకు పరిష్కార మార్గం లభించిన తరువాత.. ర్యాలీలో ఉండనున్న షేర్లలో ఎంపిక చేసిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌లు నిలవనున్నాయని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ సభ్యుడు దీపాన్ మెహతా వ్యాఖ్యానించారు. ఈ

నష్టాల్లో ఐటీ షేర్లు

Thursday 1st November 2018

కిందటి రోజు ట్రేడింగ్‌లో సూచీల భారీ లాభాలకు కారణమైన ఐటీ షేర్లు గురువారం ట్రేడింగ్‌ సెషన్‌లో మాత్రం నష్టాల బాట పట్టాయి. ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్స్‌లో 2.50శాతం శాతం నష్టపోయింది. డాలర్ మారకంలో రూపాయి బలపడటంతో ఐటీ షేర్లలో అమ్మకాలు పెరిగాయి. మధ్యాహ్నం గం.12:00లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం నష్టంతో 14,597 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

Most from this category