STOCKS

News


ఎగసి పడిన రియల్టీ షేర్లు

Monday 25th February 2019
Markets_main1551086888.png-24321

ఇళ్ల కొనుగోళ్లపై పన్ను భారాన్ని తగ్గిస్తూ జీఎస్‌టీ మండలి తీసుకున్న నిర్ణయంతో సోమవారం రియల్టీ షేర్లు ఎగిసిపడ్డాయి. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్‌టీ శాతాన్ని 12 శాతం నుంచి 5శాతానికి, అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై పన్నును 8శాతం నుంచి 1శాతానికి తగ్గిస్తున్నట్లు ఆదివారం జీఎస్‌టీ మండలి ప్రకటించింది. ఈ ప్రకటనతో నేడు రియల్‌ ఎస్టేట్‌ షేర్లు ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభపడి మిడ్‌సెషన్‌ సమయానికి క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఎన్‌ఎస్‌లో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ దాదాపు ఉదయం ట్రేడింగ్‌లో 3శాతం లాభపడింది. రియల్టీ రంగ షేర్లైన యూనిటెక్‌, సన్‌టెక్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, శోభా, ఇండియాబుల్స్‌ 4-1.5 శాతం మధ్య ఎగిశాయి. అలాగే  హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో కెన్‌ఫిన్‌, రెప్కో హోమ్‌, గృహ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4-1 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే మధ్యాహ్నం సమయానికల్లా షేర్లు నష్టాల బాట పట్టాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు ధర (233.15)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయి 232.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఒబేరాయ్‌ రియల్టి 2.50శాతం నష్టపోగా, ప్రేస్టేజ్‌ 1శాతం, సన్‌టెక్‌, డీఎల్‌ఎఫ్‌ షేరు అరశాతం నష్టపోయాయి. మరోవైపు యూనిటెక్‌ 4శాతం లాభపడగా, గోద్రేజ్ ప్రాపర్టీ 1.50శాతం, బ్రిగేడ్‌ రియల్టీ 1శాతం, శోభ, ఫోనిక్స్‌ లిమిటెడ్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.



You may be interested

2–3 వారాలకు ఈ షేర్లు చూడొచ్చు

Monday 25th February 2019

2–3 వారాల్లో రాబడులకు అవకాశం వున్న   షేర్లపై వివిధ అనలిస్టులు రూపొందించిన అంచనాలివే.. అనలిస్ట్‌: వైశాలి ఫారిఖ్, టెక్నికల్‌ అనలిస్ట్, ప్రభుదాస్‌ లీలాధర్‌ హీరో మోటో కార్ప్‌ సిఫార్సు: బై,  టార్గెట్‌: రూ. 2950, స్టాప్‌లాస్‌: రూ. 2650  ఈ షేరు ఇటీవల 2,960 గరిష్టస్థాయి నుంచి పీకవుట్‌ అయిన తర్వాత రూ. 2,580 వరకూ తగ్గింది. అయితే ఈ కనిష్టస్థాయి వద్ద డెయిలీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఫార్మేషన్‌ను కనపర్చి, బుల్లిష్‌ క్యాండిల్‌

హెచ్‌డీఎఫ్‌సీ ద్వయంపై సీఎల్‌ఎస్‌ఏ బుల్లిష్‌

Monday 25th February 2019

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ద్వయం షేర్లపై సీఎల్‌ఎస్‌ఏ రేటింగ్‌ సం‍స్థ బుల్లిష్‌గా ఉంది. ఈ రెండు షేర్లు ధీర్ఘకాలంలో 25 నుంచి 30శాతం రాబడి ఇచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ అంచనా వేసింది. ఇటీవల కొన్ని అవాంఛనీయ సంఘటనలతో ఆర్థిక రంగం కొంత ఒడిదుడుకులకు లోనైప్పటికీ.., గృహరంగానికి మాత్రం భారీ డిమాండ్‌ నెలకొని ఉంది. ఈ రంగంలో హెచ్‌డీఎఫ్‌ షేరు టాప్‌ పిక్‌గా కొనసాగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈ కారణాలతో హెచ్‌డీఎఫ్‌సీ షేరుకు

Most from this category