STOCKS

News


జీఎస్టీ తగ్గింపు​ఆశలతో రియల్టీ షేర్ల పరుగులు

Thursday 10th January 2019
Markets_main1547113109.png-23509

నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై జీఎస్టీ తగ్గింపు ఆశలతో గురువారం ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు పరుగులు పెడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు నేడు జరిగే 32వ జీఎస్‌టీ కౌన్సిల్‌ భేటీలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు, ఫ్లాట్లపై ప్రస్తుతం 12శాతంగా ఉన్న జీఎస్‌టీని 5 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నేటి ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టి ఇండెక్స్‌ అరశాతానికి పైగా ర్యాలీ చేసింది. ఈ సూచీలోని ప్రధాన షేర్లైన యూనిటెక్‌ 2.50శాతం, డీఎల్‌ఎఫ్‌ 2శాతం, శోభ 1.50శాతం, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ ఒబేరాయ్‌ రియల్టి, ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌ ప్రాజెక్ట్స్‌ 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అరశాతం లాభపడ్డాయి. మరోవైపు సన్‌టెక్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు 1శాతం వరకు నష్టపోయాయి.



You may be interested

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌

Thursday 10th January 2019

నాలుగు రోజుల ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ఆసియా, ఐరోపా మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలకు తోడు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చివరికి సెన్సెక్స్‌ 106 పాయింట్లు నష్టపోయి 36,106 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయి 10,821 వద్ద ముగిసాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగ్గా అటో, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలోని

ఇన్ఫీ ఫలితాలు ఎలా ఉంటాయి?

Thursday 10th January 2019

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఈ నెల 11న మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ దఫా లాభాల్లో స్వల్ప మెరుగుదలను కంపెనీ ప్రకటించవచ్చని అంచనాలున్నాయి. అయితే రెవెన్యూ గ్రోత్‌ మాత్రం సరాసరిన 1.5 శాతానికి పరిమితం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. లాభాల్లో వృద్ధి మైనస్‌ 3.8 నుంచి 5.2 శాతం వరకు ఉండొచ్చు. ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు - లాభంలో- 1.7 నుంచి - 3.8 శాతం

Most from this category