STOCKS

News


రియల్టీ ఇండెక్స్‌ 1 శాతం అప్‌

Friday 4th January 2019
Markets_main1546591250.png-23411

 రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్స్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 1శాతం ర్యాలీ చేసింది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(233.95)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 235.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఓబేరాయ్‌ రియల్టీ 3శాతం ర్యాలీ చేయగా, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2శాతం, గోద్రేజ్‌ పాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌ 1శాతం పెరిగాయి. యూనిటెక్‌ అరశాతం లాభపడింది. మరోవైపు శోభ 3.50శాతం నష్టపోగా, సన్‌టెక్‌ 1.50శాతం, ప్రెస్టేజ్‌ 1శాతం, బ్రిగ్రేడ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌ 1శాతం, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.
ఇక మార్కెట్‌ విషయానికొస్తే.... మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ సూచీ 150 పాయింట్ల లాభంతో 35,660 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 31 పాయింట్ల లాభంతో 10,703 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఐదు ఐటీ కంపెనీలు... 4.8 శాతం వృద్ది

Friday 4th January 2019

సీఐఎంబీ అంచనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల సీజన్‌ షురూ కానుంది. ఈ నెల 10న టీసీఎస్‌, 11న ఇన్ఫోసిస్‌ ఫలితాల వెల్లడితో సీజన్‌ ఆరంభమవుతోంది. రూపాయి పతనం, యూఎస్‌లో వృద్ధి కారణంగా ఈసారి ఫలితాల్లో ఐటీ సంస్థలు మంచి జోరు చూపవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దేశంలో టాప్‌ 5 ఐటీ కంపెనీలు సరాసరిన 1.5- 4.8 శాతం వృద్ది నమోదు చేయవచ్చని గ్లోబల్‌

ఒడిదుడుకులకు సిద్ధంకండి!

Friday 4th January 2019

మార్కెట్‌పై సీఎల్‌ఎస్‌ఏ సూచన కొత్త ఏడాది మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సూచించింది. స్వల్పకాలానికి మార్కెట్‌ రిస్కు డౌన్‌సైడ్‌ ఉండొచ్చని అంచనా వేసింది. ప్రైవేట్‌ పెట్టుబడులు పెరగడం, గృహనిర్మాణ రంగంలో రికవరీకి మరికొంత కాలం పట్టవచ్చని అభిప్రాయపడింది. ఏడాది చివరకు నిఫ్టీ టార్గెట్‌ను 11,000 పాయింట్లుగా సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది. ఈ సంవత్సరం ఎర్నింగ్స్‌ రెండంకెల స్థాయిని

Most from this category