STOCKS

News


మిశ్రమంగా రియల్టీ షేర్లు

Tuesday 4th December 2018
Markets_main1543915936.png-22619

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా బుధవారం రియల్టీరంగ షేర్లు మిశ్రమంగా ర్యాలీ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా నష్టపోయింది. ముఖ్యంగా ఈ ఇండెక్స్‌లోని ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఓబేరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీ, ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌ షేర్ల పతనం ఇండెక్స్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. మధ్యాహ్నం గం.2:45.ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు (237.60)తో పోలిస్తే 0.85శాతం నష్టంతో 235.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డీఎల్‌ఎఫ్‌,  ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌, ఓబేరాయ్‌ రియల్టీ, గోద్రేజ్‌ ప్రాపర్టీ, ఇండియాబుల్స్‌ రియల్‌ఎస్టేట్‌ షేర్లు 4నుంచి 1శాతం నష్టపోయాయి. మరోవైపు యూనిటెక్‌ షేరు 5శాతం లాభపడింది. బ్రిగేడ్‌రియల్టీ, శోభ, సన్‌టెక్‌, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ షేర్లు 2శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.


DLF

You may be interested

ఈ 8 షేర్లతో మార్కెట్‌ ర్యాలీ

Tuesday 4th December 2018

ముంబై: ప్రధాన సూచీల్లోని ఎంపిక చేసిన ఎనిమిది షేర్ల ఎర్నింగ్స్‌ వృద్ధి మొత్తం ర్యాలీకి దోహదపడనుందని ప్రముఖ బ్రోకరేజ్‌ సీఎల్‌ఎస్‌ఏ విశ్లేషించింది. కేవలం ఈ షేర్లలో వృద్ది ద్వారానే తరువాత ర్యాలీ ఉండనుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంత్సరంలో నిఫ్టీ ఎర్నింగ్స్‌ 25 శాతం వృద్ధి చెందేందుకు అవకాశం ఉందని వివరించిన ఈ బ్రోకింగ్‌ సంస్థ.. గడిచిన ఎనిమిదేళ్ల సగటు 6.5 శాతంగా ఉన్నట్లు తెలిపింది. తమ విశ్లేషణ ప్రకారం

ఎదురీదుతున్న ఐటీ షేర్లు

Tuesday 4th December 2018

మార్కెట్‌ నష్టాలకు ఐటీ షేర్లు ఎదురీదుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత అందుకు సహకరిస్తుంది. రెండురోజులుగా ముడిచమురు ధరలు ర్యాలీ చేయడం, ప్రధాన కరెన్సీల్లో డాలర్‌ బలపడటం తదితర కారణాలతో దేశీయ ఫారెక్స్‌ రూపాయి క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. రూపాయి కరిగిపోవడంతో డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు కలిసొస్తుంది. అందుకు అనుగుణంగానే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ చేసింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం

Most from this category