STOCKS

News


వెలుగులోకి రియల్టీ షేర్లు

Wednesday 6th March 2019
Markets_main1551859125.png-24454

మార్కెట్‌ స్థిరమైన ర్యాలీలో భాగంగా రియల్టీ రంగ షేర్లు బుధవారం లాభాల బాటపట్టాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.50శాతం లాభపడింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లో వాటాను కొనుగోలు చేస్తుందనే వార్తలతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు అత్యధికంగా 8శాతం లాభపడింది. బ్రిగ్రేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, సన్‌టెక్‌ 5శాతం ర్యాలీ చేశాయి. మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫోనిక్స్‌లిమిటెడ్‌ షేర్లు 1శాతం పెరిగాయి. శోభ, ప్రెస్టేజ్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు గోద్రేజ్‌ పాపర్టీస్‌, ఓబేరాయ్‌రియల్టీ షేర్లు అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:00కు రియల్టీ ఇండెక్స్‌ 1.50శాతం లాభంతో 237.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇక సూచీల విషయానికొస్తే... రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ అండతో ప్రారంభలాభాల్ని నిలుపుకుంటూ స్థిరమైన ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ మధ్యాహ్నం గం.1:00కు  సెన్సెక్స్‌ సూచీ 135 పాయింట్ల లాభంతో 36,578 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 47 పాయింట్ల లాభంతో 11,034 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

సూచీలకు ఆర్‌ఐఎల్‌ అండ

Wednesday 6th March 2019

బుధవారంనాటి సూచీల స్థిరమైన ర్యాలీకి  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌అండగా నిలిచింది.  చివరి రెండు సెషన్స్‌లో సూచీలు భారీగా లాభాలు ఆర్జిం‍చినప్పటికి.., ఈ షేరు స్తబ్దుగా ట్రేడైంది. నేడు ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో దాదాపు 3శాతం ర్యాలీ చేసి రూ.1271.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు 3శాతం ర్యాలీ చేయడంతో ఈ ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ దూకుడు

Wednesday 6th March 2019

కోబ్రాపోస్ట్‌ ఆరోపణలతో తీవ్ర నష్టాలపాలైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ షేరు బుధవారం ట్రేడింగ్‌లో ఏకంగా 20శాతం లాభపడింది. నేడు బీఎస్‌ఈలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీ షేరు రూ.147.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కోబ్రాపోస్ట్‌ చేసిన ఆరోపణలపై స్వతంత్ర చార్టర్డ్‌ అకౌంటింగ్‌ టీపీ ఓస్త్వాల్‌ అండ్‌ అడిట్‌ సంస్థ కమిటీ సభ్యులకు సమగ్ర నివేదిక సమర్పించింది. హెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీపై ఇన్వెస్టిగేషన్‌ సంస్థ కోబ్రాపోస్ట్‌ చేసిన ఆరోపణలు నిరాధారం. కోబ్రాపోస్ట్‌ చెప్పుకొచ్చిన 26 షెల్‌ కంపెనీలకు

Most from this category