STOCKS

News


రాణిస్తున్న రియల్టీ షేర్లు

Tuesday 26th March 2019
Markets_main1553590052.png-24803

లాభాల మార్కెట్‌లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ నేడు ట్రేడింగ్‌లో 1.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లోని మొత్తం 10 షేర్లకు గానూ 6 షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, 4షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ షేరు 8.50శాతం పెరిగింది.  రూ.3,000 కోట్ల రుణభారం తగ్గించుకునేందుకు సోమవారం క్యూఐపీ(క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌)ను ఆరంభించిన సంగతి తెలిసిందే. అలాగే శోభా, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఒబేరాయ్‌రియల్టీ, మహీంద్రాలైఫ్‌స్పేస్‌ షేర్లు 2శాతం పెరిగాయి. మరోవైపు ఫోనెక్స్‌ లిమిటెడ్‌, సన్‌టెక్‌, గోద్రేజ్‌ పాపర్టీస్‌, ప్రెస్టేజ్‌ లిమిటెడ్‌ షేర్లు 1.50శాతం నష్టపోయాయి. మధ్యాహ్న గం.1:30ని.లకు ఇండెక్స​గతముగింపు(రూ.261.80)తో పోలిస్తే 1.41శాతం లాభంతో 265.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇక ఇదే సమయానికి నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 11,409 వద్ద, సెన్సెక్స్‌ 200 పాయింట్లు పెరిగి 37,988 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

ఈ కౌంటర్లలో నెగిటివ్‌ సంకేతాలు

Tuesday 26th March 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు వాడే ఎంఏసీడీ ఇండికేటర్‌ ఆధారంగా షేరు కదలికలను పరిశీలిస్తుంటారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌

రెండోరోజూ జెట్‌ఎయిర్‌వేస్‌ జంప్‌

Tuesday 26th March 2019

జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్ల జోరు వరుసగా రెండోరోజూ కొనసాగుతోంది. నేడు బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు రూ.265.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తీవ్ర నిధుల కొరత, రుణ భారం సమస్యల నుంచి గట్టేందుకు పలు బ్యాంకులు కంపెనీకి రూ. 1500 కోట్ల అదనపు రుణాలను మంజూరు చేయనున్నాయి. స్టేట్‌బ్యాంక్‌ అధ్యక్షతన రుణదాతల కన్సార్షియం కంపెనీలో మెజారిటీ వాటాను తీసుకోనుండటం, ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌ పదవి నుంచి తప్పుకునేందుకు నిర్ణయించుకోవడం వంటి సానుకూలాంశాలతో

Most from this category