STOCKS

News


రాణించిన రియల్టీ షేర్లు

Monday 18th March 2019
Markets_main1552906278.png-24672

రియల్టీరంగ షేర్లు సోమవారం రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ప్రెస్టేజ్‌ ఎస్టేట్‌ 16శాతం లాభపడింది. బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 7శాతం పెరిగింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఐబీరియల్‌ఎస్టేట్‌ షేర్లు 4శాతం ర్యాలీ చేశాయి. శోభ, ఓబేరాయ్‌ రియల్టీ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. మహీంద్రా లైఫ్‌, సన్‌టెక్‌ షేర్లు స్వల్పంగా అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఫోనెక్స్‌ లిమిటెడ్‌, డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు(251.60)తో పోలిస్తే 2.68శాతం లాభపడి 258.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రూపాయి బలం వెనుక కారణాలు

Tuesday 19th March 2019

రూపాయి ఈ స్థాయి నుంచి ఇంకొంత లాభపడే అవకాశాలు ఉన్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ భాస్కర్‌పాండా తెలిపారు. సాంకేతికంగా 68.80 సాంకేతిక స్థాయి అని తాను ఎప్పటి నుంచో చెబుతున్నట్టు గుర్తు చేశారు. రూపాయి ఈ స్థాయిని బ్రేక్‌ చేయడంతో 68.46 వరకు వెళ్లొచ్చన్నారు.  రూపాయి బలం ఇందు వల్లే...  మార్చిలో రూపాయి టర్న్‌ అరౌండ్‌ కావడం వెనుక ఐదు ప్రాథమిక కారణాలు ఉన్నాయి.  మార్చి నెలలో దాదాపు సాధారణంగా రూపాయి

ఆరో రోజూ ఆగని ర్యాలీ

Monday 18th March 2019

మార్కెట్‌ లాభాల ర్యాలీ ఆగడం లేదు. వరుసగా ఆరోరోజూ లాభాలతో ముగిసింది. ఈ సోమవారం సెన్సెక్స్‌ 71 పాయింట్ల లాభంతో 38,095 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,462 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లు రాణించడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 214 పాయింట్లు లాభపడి 29,596  పాయింట్ల  వద్ద స్థిరపడింది. ఇంట్రాడే లో బ్యాంకింగ్‌, ఆర్థిక, ఫైనాన్స్‌, మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు అటో షేర్లు అమ్మకాల

Most from this category