STOCKS

News


రెండోరోజూ రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Wednesday 3rd April 2019
Markets_main1554280808.png-24955

స్టాక్‌ మార్కెట్లో రియల్టీ రంగ షేర్లు వరుసగా రెండో రోజూ ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ బుధవారం ట్రేడింగ్‌లో 2.50శాతం లాభపడింది. ఇండెక్స్‌ రెండురోజుల్లో 3శాతం పెరగ్గా, నెలరోజుల్లో ఏకంగా 21శాతం ర్యాలీ చేసింది. రియల్టీ రంగ షేర్లలో గోద్రేజ్‌ ప్రాపర్టీ షేరు నేటి ట్రేడింగ్‌లో 5శాతం ర్యాలీ చేసి రూ.937ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది చివరి త్రైమాసికంలో 2,900 ఇళ్లకు విక్రయించి రూ.2100 కోట్లను ఆర్జించినట్లు ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఇప్పటి వరకు ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. ఫలితంగా నేటి ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అలాగే ఇదే రంగానికి చెందిన డీఎల్‌ఎఫ్‌ షేరు 3శాతం లాభపడి రూ.209ల వద్ద  52-వారాల గరిష్టానికి చేరుకుంది. గతేడాది క్యూఐపీ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.3,173 కోట్ల సమీకరణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. వీటితో పాటు ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌, మహీంద్రా లైప్‌ డెవెలపర్స్‌, ఫోనెక్స్ లిమిటెడ్‌, బ్రిగ్రేడ్‌, సన్‌ టెక్‌ షేర్లు 2శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని శోభ షేరు అత్యధికంగా 2శాతం నష్టపోగా, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్స్‌ఫైనాన్స్‌, ఒబేరాయ్‌ రియల్టీ షేరు అరశాతం నష్టపోయాయి. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(273.40)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.276.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

70 డాలర్లకు చేరువలో బ్రెంట్‌!

Wednesday 3rd April 2019

వరుసగా నాలుగో రోజు కూడా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పాజిటివ్‌గా కొనసాగుతున్నాయి. ఒపెక్‌ ఉత్పత్తి, సరఫరా కోతలు, కొన్ని దేశాలపై యూఎస్‌ ఆంక్షల ప్రభావం.. అనే జంట కారణాలు చమురు మార్కెట్‌ను ముందుకు నడిపాయి. ఒకపక్క యూఎస్‌ నిల్వల్లో అనూహ్య పెరుగుదల నమోదయిందన్న వార్తను మార్కెట్‌ పట్టించుకోలేదు. దీంతో బ్రెంట్‌ క్రూడాయిల్‌ పీపా ధర నవంబర్‌ 12 తర్వాత తొలిసారి 69.87 డాలర్లను తాకింది. డబ్ల్యుటీఐ క్రూడ్‌ పీపా

మార్కెట్లో గెలవాలంటే... ‘హృతిక్‌ డాన్స్‌’ చెయ్యాల్సిందే!

Wednesday 3rd April 2019

రిటైల్‌ ఇన్వెస్టర్ల ధృక్పథంలో మార్పు అవసరం మార్కెట్లో రాణించాలంటే డాన్స్‌ చేయాలా! ఇంకా నయం... మా వల్ల కాదు.. అనుకుంటున్నారా.. ఒక్క నిమిషం.. డాన్స్‌ అంటే డాన్స్‌ కాదండీ, ఈ డాన్సుకు వేరే మీనింగుంది... ఒకసారి పూర్తిగా చూడండి .. రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్లో గెలవాలంటే ‘హృతిక్‌ డాన్స్‌’ చేయాలని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సూచిస్తోంది. సాధారణంగా రిటైల్‌ మదుపరి ఫండమండెల్స్‌, టెక్నికల్‌ అనాలసిస్‌ తదితర అంశాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటాడు.

Most from this category