News


సుప్రీం దెబ్బ.. రియల్టీ షేర్లు పతనం

Monday 3rd September 2018
news_main1535955943.png-19910

రియల్‌ ఎస్టేట్‌ షేర్లు సోమవారం మార్నింగ్స్‌ సెషన్‌లో 2-3 శాతంమేర పతనమయ్యాయి. కొన్ని రాష్టాల్లో నిర్మాణాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించడం ప్రతికూల ప్రభావం చూపింది. మహరాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరఖండ్‌, ఛండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ (ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ) పాలసీలను అమలు చేయకపోవడంతో సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధం కారణంగా ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం పడుతుందని, అదే నిషేధం ఎక్కువ కాలం కొనసాగితే అప్పుడు ప్రాజెక్టుల పూర్తిపై తీవ్ర ప్రభావం ఉంటుందని రీసెర్చ్‌ సంస్థ సిటీ తెలిపింది. ముంబైలో ఎక్కువ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందున ఒబేరాయ్‌ రియల్టీపై ఎక్కువ ప్రభావం ఉంటుందని పేర్కొంది. 

ఉదయం 9:28 సమయంలో సన్‌టెక్‌ రియల్టీ షేరు 2.28 శాతం క్షీణతతో 501 వద్ద, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేరు 2.1 శాతం క్షీణతతో రూ.672 వద్ద, ఒబేరాయ్‌ రియల్టీ షేరు 0.66 శాతం క్షీణతతో రూ.439 వద్ద, కోల్టే-పాటివ్‌ డెవలపర్స్‌ 2.46 శాతం క్షీణతతో రూ.272 వద్ద, డీఎల్‌ఎఫ్‌ షేరు 2.84 శాతం క్షీణతత రూ.214 వద్ద, కెపాసిటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ 0.59 శాతం క్షీణతతో రూ.268 వద్ద ట్రేడవుతున్నాయి. 



You may be interested

విప్రో వెలుగులు

Monday 3rd September 2018

9శాతం లాభపడి షేరు ఎలైట్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌సీ నుంచి ఓ భారీ ఆర్డర్‌ను చేజిక్కించుకోవడంతో దేశీయ ఐటీ సేవల దిగ్గజం విప్రో షేరు సోమవారం దాదాపు 9శాతం లాభపడింది. అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ర్టానికి చెందిన ఎలైట్ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌సీ నుంచి 1.5 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు విప్రో ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనతో నేడు బీఎస్‌ఈలో విప్రో షేరు​గత ముగింపుధర(రూ.328.00)పోలిస్తే 8.73శాతం లాభంతో రూ.328.00ల వద్ద

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 3rd September 2018

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధర నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ పెరుగుదల అందుకు కారణమవుతోంది. నేడు ఆసియా మార్కెట్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం 10:10లకు ఔన్స్‌ పసిడి 1.10 డాలర్లు నష్టపోయి 1,205.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతవారంలో అమెరికా-కెనడా మధ్య జరిగిన వాణిజ్య చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ఈ సెప్టెంబర్‌ 5నుంచి చైనాపై అమెరికా విధించిన 200 మిలియన్ల డాలర్ల దిగుమతి సుంకాలు అమల్లోకి రానున్నాయి.

Most from this category