STOCKS

News


ఆర్‌కామ్‌ 48 శాతం క్రాష్‌

Monday 4th February 2019
Markets_main1549255718.png-23994

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారభంలోనే ఏకంగా 48శాతం నష్టపోయింది. దివాళా పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించడం ఇందుకు కారణం. ఆస్తులను విక్రయించేందుకు రుణదాతల నుంచి 100శాతం అనుమతులు రాకపోవడంతో  దివాలా పిటిషన్‌ ద్వారా ఎన్‌సీఎల్‌టీ మార్గంలోనైనా రుణ పరిష్కార ప్రక్రియకు ఆమోదం తీసుకోవాలని ఆర్‌కామ్ భావిస్తున్నట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో కంపెనీ ఆర్‌కామ్‌ షేరు 10శాతం నష్టంతో రూ.10.44ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు పూనుకోవడంతో షేరు క్షణాల్లోనే 48.27శాతం నష్టపోయింది. ఉదయం గం.9:45ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.11.6)తో పోలిస్తే దాదాపు 40శాతం నష్టంతో 6.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.6.00 రూ.30.60లు నమోదయ్యాయి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆర్‌కామ్‌ తన రుణభారాన్నీ తగ్గించుకునేందుకు కంపెనీ టెలికాం, స్పెక్ట్రామ్‌ వ్యాపారవిభాలగాలను అమ్మకానికి ఉంచింది. అయితే ఆస్తులు అమ్మకానికి సంబంధించి రుణదాతల నుంచి 100శాతం ఆమోదం రాలేదు.You may be interested

అడాగ్‌ షేర్లకు ఆర్‌కామ్‌ దెబ్బ..!

Monday 4th February 2019

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్ల భారీ పతనం అడాగ్‌ షేర్లను నష్టాల బాట పట్టించింది.  దివాళా పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించడంతో నేడు ఆర్‌కామ్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఏకంగా 48శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆర్‌కామ్‌ పతనం దెబ్బకు అడాగ్‌ కంపెనీలో దాదాపు షేర్లనీ 52-వారాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ గ్రూప్‌ కంపెనీలోని రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, రిలయన్స్‌

నష్టాలతో ప్రారంభం

Monday 4th February 2019

రెండురోజుల వరుసగా ర్యాలీకి స్వస్తి పలుకుతూ సోమవారం దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గత ముగింపు(36,469)తో పోలిస్తే 13పాయింట్లను కోల్పోయి 36,456 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ గతముగింపు(10,893)తో పోలిస్తే నిఫ్టీ 17పాయింట్ల నష్టంతో 10,876.75 వద్ద ప్రారంభమైంది. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణత ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపింది. అలాగే బడ్జెట్‌ సందర్భంగా గత ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన అటో రంగషేర్లలో అమ్మకాలు ఎ‍క్కువగా ఉన్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లలో

Most from this category