STOCKS

News


నవంబర్‌లో రూ.40వేల కోట్ల సెక్యూరిటీల కొనుగోలు: ఆర్‌బీఐ

Saturday 27th October 2018
Markets_main1540618708.png-21531

ముంబై:- ఆర్థిక వ్యవస్థలో నగదు కొరతను తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చర్యలకు పూనుకుంది. అందులో భాగంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి ఈ నవంబర్‌లో రూ.40 వేల కోట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రజలు, వాణిజ్య సంస్థలు, ఇతర విత్తసంస్థల నుంచి నవంబర్‌లో బహిరంగ మార్కెట్ కార్యకలాపాల (ఓఎంవో) ద్వారా ప్రభుత్వానికి చెందిన రూ.40 వేల కోట్ల విలువైన సెక్యూరిటీలను కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే అక్టోబర్లో రూ.36 వేల కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను ఓపెన్‌ మార్కెట్ పద్దతిలో కొనుగోలు చేసినట్లు ఆర్‌బీఐ ఈ సందర్భంగా తెలియజేసింది. ఇండియా రేటింగ్స్‌ ప్రకారం గత మూడు వారాల నుంచి బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్రవ్యలోటుతో నడుస్తోంది. రోజువారీగా ద్రవ్యలోటు రూ.87,500 కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్ల మధ్యలో ఉంటుందని సంస్థ తెలిపింది. గత సోమవారం అత్యధికంగా ద్రవ్యలోటు 1.4 లక్షల కోట్ల చేరుకుంది.  సాదారణంగా మార్కెట్లో ద్రవ్య లభ్యత పెంచండం, రూపాయి పతనాన్ని అరికట్టేందుకు, ఆర్థికమాంద్యకాలంలో ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది.


RBI

You may be interested

2 కొనొచ్చు.. 1 హోల్డ్‌ చేయొచ్చు..

Saturday 27th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌.. బజాజ్‌ ఆటో, డీబీ కార్ప్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అలాగే జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను హోల్డ్‌ చేయవచ్చని సూచించింది. ఎందుకో చూద్దాం..  బజాజ్‌ ఆటో కంపెనీ క్యూ2 ఎర్నిం‍గ్స్‌ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని సెంట్రమ్‌ పేర్కొంది. బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నామని తెలిపింది. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.3,167 నుంచి రూ.3,075కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. స్టాక్‌ ప్రస్తుత ధర రూ.2,513తో పోలిస్తే 22 శాతం అప్‌సైడ్‌కు ఛాన్స్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 5% జంప్‌..

Saturday 27th October 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగితే, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, వేదాంత ఏడీఆర్‌లు క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా తగ్గింది.  టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.69 శాతం క్షీణతతో 11.59 డాలర్లకు తగ్గింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.99

Most from this category