STOCKS

News


బాండ్లు, రూపీకి ఆర్‌బీఐ బూస్ట్‌

Wednesday 10th October 2018
Markets_main1539158041.png-21015

ప్రస్తుత పరిస్థితుల్లో లిక్విడిటీకి మద్దతునిచ్చే ఎలాంటి చర్య అయినా ఆహ్వానించదగినదేనని కోటక్‌ ఎంఎఫ్‌ సీఐవో (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌), హెడ్‌ (ప్రొడక్ట్స్‌) లక్ష్మీ ఐయ్యర్‌ తెలిపారు. ఆమె ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్‌బీఐ ఈ నెలలో రూ.36,000 కోట్ల మేర విలువైన బాండ్లను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించుకుందని, అందులో భాగంగానే అక్టోబర్‌ 11న రూ.12,000 కోట్లు ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనుందని తెలిపారు. ఆర్‌బీఐ నిర్ణయంతో మార్కెట్లకు కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా మార్కెట్‌లో లిక్విడిటీ పెరుగుతుందని తెలిపారు. బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుతున్నప్పుడు.. కరెన్సీపై ఒత్తిడి పెరుగుతుందని, అలాగే ఈల్డ్స్‌ తగ్గే కొద్ది ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. మరీముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు సిద్ధమౌనప్పుడు ఈల్డ్స్‌ పెరుగుతాయని తెలిపారు. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వపు వివిధ స్థాయిల్లో చిన్నపాటి జోక్యం వల్ల డాలర్‌-రూపాయి మారకపు విలువపై కూడా ప్రభావం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా రూపాయి ఓవర్‌ వ్యాల్యుయేషన్‌ తగ్గుతోందన్నారు. అందువల్ల పాజిటివ్‌ సెంటిమెంట్‌ ఏర్పడొచ్చని, అందువల్ల రూపాయి స్వల్పంగా రికవరీ అవ్వొచ్చని తెలిపారు. అయితే ఇది స్వల్ప కాలం ఉంటుందా?దీర్ఘ కాలం ఉంటుందా? చెప్పలేమన్నారు. 
ప్రస్తుత ఏడాది నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్ల ఆస్తులను (రుణ పోర్ట్‌ఫోలియోలను) కొనుగోలు చేస్తామని ఎస్‌బీఐ ప్రకటించిందని లక్ష్మీ ఐయ్యర్‌ తెలిపారు. ఇది కూడా మార్కెట్‌కు ఉపశమనం కలిగించే వార్తని పేర్కొన్నారు. మరో రెండు బ్యాంకులు ఇలాంటి నిర్ణయాలనే ప్రకటిస్తే అప్పుడు మార్కెట్‌లో కొనుగోళ్లు పెరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన ఆస్తులు అందుబాటులో ఉన్నాయని, వాటిని బ్యాంకులు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు మార్కెట్లకు ఓదార్పునిస్తాయని తెలిపారు. 


RBI

You may be interested

క్యాడ్‌తోనే ఆందోళన..

Wednesday 10th October 2018

అధిక క్రూడ్‌ ధరలు ఆర్థిక వ్యవస్థకు చేటని మనులైఫ్‌ ఏఎం ఎండీ రాణా బి గుప్తా తెలిపారు. ఒక వేళ వాణిజ్య లోటు 18-19 బిలియన్‌ డాలర్లమేర నమోదైతే.. అప్పుడు కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) దాదాపు 3 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. ఇది ఆందోళన చెందాల్సిన అంశమని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ఫెడ్‌ పాలసీ నిర్ణయాలను రాజకీయాలు

ఈ పతనం ఆగనిది..

Wednesday 10th October 2018

రూపీ క్షీణత వచ్చే ఏడాది కూడా కొనసాగుతుంది రాయిటర్స్‌ నివేదిక భారత కరెన్సీ మరికొంత కాలం తాజా కనిష్ఠాలకు అటుఇటుగానే కదలాడవచ్చని రాయిటర్స్‌ పోల్‌లో ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది సైతం రూపాయి ఇదే స్థాయిలకు అటుఇటుగా ఉండొచ్చని, ఎలాంటి భారీ రికవరీ ఆశించలేమని అంచనా వేశారు. డిసెంబర్‌లో, వచ్చే ఏడాది రేట్లు పెంచుతామని ఆర్‌బీఐ తన తాజా సమీక్షా సమావేశం అనంతరం వెల్లడించింది. ఆర్‌బీఐ రేట్లు పెంచినా ఎలాంటి ఫలితం ఉండదని,

Most from this category