STOCKS

News


రూపీ ఇంకా పడొచ్చు.. ఐటీ, ఫార్మాపై కన్నేయండి..

Wednesday 3rd October 2018
Markets_main1538553323.png-20823

ఇండియన్‌ రూపాయి బుధవారం 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే జీవిత కాల కనిష్ట స్థాయి 73.40ని తాకింది. అయితే ఈ పతనం మరింత కొనసాగవచ్చని మర్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. ‘ఆర్‌బీఐ చర్యలు మార్కెట్‌లో లిక్విడిటీ సమస్యను శాంతింపజేస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ రూపాయి పతనాన్ని నియంత్రించకపోవచ్చు. క్రూడ్‌ ధరలు పెరుగుతున్నాయి. ఆర్‌బీఐ వ్యవస్థలోకి ఎక్కువ లిక్విడిటీని తీసుకువస్తోంది. దీని వల్ల రూపాయిలో మరింత క్షీణత నమోదు కావొచ్చు. అందువల్ల ఐటీ, ఫార్మా షేర్లు ప్రయోజనం పొందుతాయి’ అని వివరించారు. వచ్చే 2-3 త్రైమాసికాల్లో ఇండియన్‌ ఐటీ రంగ కంపెనీల నుంచి అదిరిపోయే ఎర్నింగ్స్‌ వెలువడే అవకాశముందని తెలిపారు. రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణమని, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటం మరొక సానుకూల అంశమని పేర్కొన్నారు. లార్జ్‌క్యాప్‌లో టీసీఎస్‌, మిడ్‌క్యాప్‌లో ఎల్‌అండ్‌టీ ఎక్కువగా లాభపడొచ్చని తెలిపారు. ఇటీవలి మార్కెట్‌ కరెక‌్షన్‌కు లిక్విడిటీ భయాలు కారణమని పేర్కొన్నారు. అయితే ఆర్‌బీఐ తన చర్యల వల్ల మార్కెట్‌లో ఆందోళనలు తొలగించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలోని షేర్లు ఇంకా అధిక వ్యాల్యుయేషన్స్‌తో ఉన్నాయని పేర్కొన్నారు. రుణ సమీకరణ వ్యయాలు పెరిగాయని, అందువల్ల ఎన్‌బీఎఫ్‌సీలు బ్యాంకుల నుంచి, హోల్‌సెల్‌ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించడం కష్టమౌతుందని తెలిపారు. మార్కెట్లలో భయాందోళనలను తొలగించడానికి ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తీసుకున్న చర్యలు అభినందనీయమని, అయితే ఇంకా సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఎన్‌బీఎఫ్‌సీలకు సమస్యలు పొంచి ఉన్నాయని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీల వృద్ధి రేటు దిగివస్తే.. అప్పుడు లెండింగ్‌ కార్యకలాపాలు తగ్గుతాయని, తద్వారా ఆటో స్టాక్స్‌పై నెగటివ్‌ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.  



You may be interested

షార్ట్‌టర్మ్‌ కోసం ఐదు రికమండేషన్లు

Wednesday 3rd October 2018

వచ్చే ఒకటి రెండు నెలల్లో 13 శాతం వరకు రాబడినిచ్చే ఐదు స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ శాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 850. స్టాప్‌లాస్‌ రూ. 710. ఏడాదిగా హయ్యర్‌ టాప్స్‌ ఏర్పరుస్తూ అప్‌ట్రెండ్‌లో ఉంది. తాజాగా వచ్చిన పతనంలో ఊర్ధ్వముఖ ట్రెండ్‌లైన్‌ వద్ద మద్దతు తీసుకుంది. ఇదే ప్రాంతంలో 21 రోజుల డీఎంఏ స్థాయి కూడా ఉంది. సోమవారం షేరు మరో

బ్యాంక్‌ నిఫ్టీ రికవరీ

Wednesday 3rd October 2018

ఒడిదుడుకుల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ నష్టాల ట్రేడింగ్‌ నుంచి రికవరీ బాట పట్టింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 25,290.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ షేర్ల పతనం కారణంగా ఈ సూచీ 1శాతం నష్టపోయి 25143.00 స్థాయికి పతనమైంది. అనంతంర మార్కెట్‌ రికవరీలో భాగంలో యస్‌బ్యాంక్‌(8శాతం లాభం) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు

Most from this category