STOCKS

News


ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత ఊరట

Saturday 29th December 2018
Markets_main1546057459.png-23307

-సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ పొడిగింపు
 మరో మూడు నెలలు వరకూ

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) ఊరటనిచ్చే నిర్ణయాన్ని ఆర్‌బీఐ తీసుకుంది. సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ ఫెసిలిటీని మరో మూడు నెలలు పొడిగించింది. దీంతో లిక్విడిటీ సమస్యలతో సతమతమవుతున్న ఎన్‌బీఎఫ్‌సీలకు మరింత వెసులుబాటు చిక్కుతుంది. బ్యాంక్‌లు ఎన్‌బీఎఫ్‌సీలకు ఇచ్చే సింగిల్‌ బారోవర్‌ లిమిట్‌ ఫెసిలిటీని ఈ ఏడాది అక్టోబర్‌లో  ఆర్‌బీఐ 10 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీనిని ఈ నెల 31 వరకూ గడువునిచ్చింది. తాజాగా ఈ గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగించింది. ఈ ఉత్తర్వుల కారణంగా బ్యాంక్‌లు తమ క్యాపిటల్‌ ఫండ్‌లో 15 శాతం వరకూ నిధులను ఎన్‌బీఎఫ్‌సీలకు, హెచ్‌ఎఫ్‌సీలకు మరో మూడు నెలల వరకూ ఇవ్వగలుగుతుంది. నిధుల కొరతతో అల్లాడుతున్న ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలకు ఒకింత ఊరట లభించనున్నది.



You may be interested

పార్లమెంట్‌లో ‘‘బిజినెస్‌’’

Saturday 29th December 2018

ఆర్‌బీఐ పనితీరుపై అసంతృప్తి లేదు: జైట్లీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) పనితీరు పట్ల అసంతృప్తి లేదని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ‘‘ఇటీవలి కాలంలో ఆర్‌బీఐ పర్యవేక్షణ, నియంత్రణ గణనీయంగా మెరుగుపడింది. పటిష్టమయ్యింది’’ అంటూ ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ఇచ్చిన ఒక నివేదికను కూడా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆర్‌బీఐ నియంత్రణలో ఉన్న రూ.9

ఆరు నెలల్లో ఎన్‌పీఏలు రూ.23,000 కోట్లు తగ్గాయి

Saturday 29th December 2018

ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడి న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్‌పీఏలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు) రూ.23,860 కోట్లు తగ్గాయని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ వెల్లడించారు. 2018 మార్చి నాటికి రూ.9.62 లక్షల కోట్లకు చేరగా ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టినట్టు చెప్పారు. ఇదే

Most from this category