STOCKS

News


రూపాయి‘‘బూస్ట్‌’’కు ఆర్‌బీఐ చర్యలు

Thursday 20th September 2018
Markets_main1537427793.png-20405

  • విదేశీ నిధుల సమీకరణ 
    నిబంధనల సరళతరం
  • తయారీ కంపెనీలకు ప్రోత్సాహం
  • మసాలా బాండ్స్‌ మార్కెట్‌కూ-
  • బ్యాంకులకు అనుమతి

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి బలోపేత చర్యలకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తయారీ రంగంలో కంపెనీలు విదేశీ నిధుల సమీకరించుకోడానికి (ఈసీబీ) సంబంధించిన నిబంధనలను బుధవారం సడలించింది. అలాగే రూపీ డినామినేటెడ్‌ బాండ్లు  (మాసాలా బాండ్స్‌) మార్కెట్‌కూ ఇండియన్‌ బ్యాంక్‌లకు అనుమతినిచ్చింది. గత శనివారం రూపాయి బలోపేతానికి ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం దీనికి నేపథ్యం. విదేశీ వాణిజ్య రుణాల (ఈసీబీ) నిబంధనల సరళీకరణ కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి. తాజా నిర్ణయంపై ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘‘ప్రభుత్వంతో సంప్రతింపుల అనంతరం తాజా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది’’ అని ఈ నోటిఫికేషన్‌లో వివరించింది. దీని ప్రకారం...

  • తయారీ రంగంలో ఉండి విదేశీ వాణిజ్య రుణాలు సమీకరించుకోడానికి అర్హత ఉన్న కంపెనీలు  ఏడాది కనీస సగటు మెచ్యూరిటీ కాలపరిమితితో 50 మిలియన్‌ల అమెరికన్‌ డాలర్లు లేదా అంతకు సమానమైన ఈసీబీలను సమీకరించుకునే వీలుకలిగింది. ఇంతక్రితం కనీస సగటు మెచ్యూరిటీ కాలపరిమితి  మూడేళ్లుగా ఉండేది.
  • మసాలా బాండ్ల విదేశీ మార్కెట్‌కూ నిబంధనలలోనూ మార్పులు చేసింది. ఇలాంటి బాండ్స్‌కు ప్రస్తుతం భారత బ్యాంకులు ఎరైంజర్‌ లేదా అండర్‌రైటర్‌గా మాత్రమే వ్యవహరించగలుగుతున్నాయి. ఇష్యూ అండర్‌రైటింగ్‌ సందర్భంలో బ్యాంకుల హోల్డింగ్‌ ఐదు శాతానికి మించి ఉండడానికి వీల్లేదు.  అయితే ఇకపై బ్యాంకులు ఈ బాండ్లకు సంబంధించి కొన్ని నిర్దిష్ట నిబంధనలకు లోబడి అరేంజర్స్‌, అండర్‌రైటర్స్‌గా ఉండడమే కాకుండా మార్కెట్‌ మేకర్స్‌, ట్రేడర్లుగా కూడా వ్యవహరించడానికి వీలుంది.You may be interested

రోబో సిలికాన్‌ మరో 9 ప్లాంట్లు

Thursday 20th September 2018

రెండేళ్లలో రూ.90 కోట్ల పెట్టుబడి కంపెనీ సీఈవో సుమ్నేష్‌ ఖండెల్వాల్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- రోబో బ్రాండ్‌తో ఇసుక తయారీ, విక్రయంలో ఉన్న రోబో సిలికాన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, విజయవాడ, బెంగళూరు, మంగళూరు, దాద్రిలో మొత్తం 11 ప్లాంటున్నాయి. రెండేళ్లలో మరో 9 తయారీ కేంద్రాలను స్థాపించనున్నట్టు రోబో సిలికాన్‌ సీఈవో సుమ్నేష్‌ ఖండెల్వాల్‌ తెలిపారు. ఫైనాన్స్‌ హెడ్‌ అమిత్‌ జైన్‌తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో

యస్‌ బ్యాంక్‌ కపూర్‌కు ఆర్‌బీఐ నో

Thursday 20th September 2018

ఆర్‌బీఐ ఆదేశాలు 2019 జనవరి తుది గడువుగా నిర్దేశం- న్యూఢిల్లీ: ఎస్‌ బ్యాంక్‌ చీఫ​ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) రాణా కపూర్‌ పదవీకాలాన్ని బ్యాంకింగ్‌ రెగ్యులేటర్‌- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కుదించింది. 2019 జనవరి నాటికి ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రైవేటు దిగ్గజ బ్యాంక్‌కు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2004లో బ్యాంకును ప్రారంభించినాటి నుంచీ రాణా కపూర్‌ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2021

Most from this category