STOCKS

News


రెపోరేటు కోత : అటో షేర్ల ర్యాలీ

Thursday 7th February 2019
Markets_main1549531695.png-24072

బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేట్ల(రెపో రేటు)ను తగ్గించడంతో గురువారం మిడ్‌సెషన్‌ అనంతరం అటో షేర్లు లాభాల బాట పట్టాయి. రెపో రేట్ల తగ్గింపుతో వాహన రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గవచ్చనే అంచనాలు అటో షేర్ల కొనుగోళ్లకు కారణమవుతున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధిక అశోక్‌లేలాండ్‌ 6శాతానికి పైగా ర్యాలీ చేసింది. అలాగే టీవీఎస్‌మోటర్‌, అపోలో టైర్స్‌ 4శాతం లాభపడ్డాయి. ఐషర్‌మోటర్స్‌, మదర్‌ సుమీ, బజాజ్‌ అటో, టాటామోటర్స్‌, టాటామోటర్స్‌ డీవీఆర్‌ షేర్లు 3శాతం పెరిగాయి. హీరోమోటోకార్ప్‌, భారత్‌ ఫోర్జ్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేయగా, మారుతి, ఎంఅండ్‌ఎం, అమరరాజా బ్యాటరీస్‌, ఎంఆర్‌ఎఫ్‌ షేర్లు 1నుంచి అరశాత లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.2:30ని.లకు ఇండెక్స్‌  గతముగింపు(8,567.40)తో పోలిస్తే 2శాతం లాభంతో 8,748.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


RBI

You may be interested

సెన్సెక్స్‌ మైనస్‌ : నిఫ్టీ ప్లస్‌

Thursday 7th February 2019

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయంతో మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్‌ 4పాయింట్ల స్వల్ప నష్టంతో 36,971 వద్ద, నిఫ్టీ 7పాయింట్ల స్వల్ప లాభంతో 11,069 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు నేపథ్యంలో అటో, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగ్గా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 27,387 వద్ద

ఆగని అడాగ్‌ పతనం

Thursday 7th February 2019

అనిల్‌ అంబానీ గ్రూప్‌ అడాగ్‌ షేర్ల పతనం ఆగట్లేదు. వరుసగా నాలుగో రోజూ నష్టాల బాట పట్టాయి. ఆస్తుల అమ్మకానికి చట్టపరమైన సమస్యలు తలెత్తడంతో అడాగ్‌ గ్రూప్‌ దివాళా పరిష్కారానికి ఎన్‌సీఎటీకి వెళ్లనుండటం ఇందుకు నేపథ్యం. తాజాగా నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 20శాతం, రిలయన్స్‌ పవర్‌  14శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ 12శాతం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 6శాతం, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్ష్‌ 3శాతం నష్టపోయాయి. 1.రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- నేటి ఇంట్రాడే

Most from this category