STOCKS

News


సీఆర్‌ఆర్‌ తగ్గించే యోచనలో ఆర్‌బీఐ..!

Thursday 15th November 2018
Markets_main1542265973.png-22045

ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో కోత విధించేందుకు అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. బ్యాంకులు తమ వద్దకు వచ్చిన మొత్తం డిపాజిట్లలో కొంత భాగాన్ని తప్పనిసరిగా ఆర్‌బీఐ వద్ద ఉంచాలన్న నిబంధనే సీఆర్‌ఆర్‌ కాగా, ప్రస్తుతం ఈ రేటు 4 శాతంగా ఉంది. సీఆర్‌ఆర్‌ రూపంలో ఆర్‌బీఐ వద్ద రూ.5 లక్షల కోట్లు ఉండగా, ఈ మొత్తంపై బ్యాంకులకు ఎటువంటి వడ్డీ ఉండదు. సీఆర్‌ఆర్‌ను ఒక శాతం తగ్గిస్తే బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి వస్తాయని అంచనా. వ్యవస్థలో నగదు లభ్యత పెంచాలంటే ఆర్‌బీఐకి ఉన్న ఆప్షన్‌ సీఆర్‌ఆర్‌ను తగ్గించడమే అని మాజీ ఆర్థిక కార్యదర్శి డీకే మిట్టల్ తాజాగా వ్యాఖ్యానించారు. మరోవైపు, బ్యాంకులు తగిన మొత్తంలో రుణాలను జారీ చేసేందుకు వీలుగా క్యాపిటల్‌ అడెక్విసీ నిబంధనలను సడలించాలని ప్రభుత్వం ఆర్‌బీఐని కోరుతోంది. బాసిల్‌ త్రీ సూచనలకు మించి ఈ నిబంధనలు కొనసాగుతుండడం వల్ల బ్యాంకుల రుణజారీలో పరిమితి అధికంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కనీసం 9 శాతం క్యాపిటల్‌ అడెక్విసీ ఉండాలని ఆర్‌బీఐ బ్యాంకులను సూచించగా.. ఇందులో 5.5 శాతం సాధారణ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ) నిబంధన కొనసాగుతుండగా, ఇది 4.5 శాతం ఉండాలనేది బాసిల్‌ త్రీ సూచన. ఈ విషయంపై ఆర్‌బీఐ నుంచి ఆశించే స్థాయిలో నిర్ణయం వెలువడకపోయినప్పటికీ.. తక్షణ చర్య కింద సీఆర్‌ఆర్ కోత ఉండవచ్చని కేర్‌ రేటింగ్స్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ మదన్ సబ్‌నవిస్ అన్నారు. ములధన నిబంధనలను నీరుగార్చడం కంటే.. సీఆర్‌ఆర్ తగ్గింపు వల్ల రుణజారీ పెరుగుదలకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వచ్చే 5 నెలల్లో రూ.1.2 లక్షల కోట్ల నూతన టైర్‌ 1 క్యాపిటల్‌ అవసరం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. రీక్యాపిటలైజేషన్‌ ప్లాన్‌ కింద గడిచిన 18 నెలల్లో రూ.1.12 లక్షల కోట్లు విడుదలచేయగా.. మార్చి 2019 నాటికి ఇంకా రూ.99,000 కోట్ల అవసరం ఉందని విశ్లేషించింది. ఆర్‌బీఐ సీఆర్‌ఆర్‌ను తగ్గించడం వల్ల ద్రవ్య లభ్యత సమస్యను అధిగమించే అవకాశం లభించడంతో పాటు రుణజారీకి అవసరమైన నిధులు బ్యాంకులకు సమకూరుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదురి అన్నారు. సీఆర్‌ఆర్‌ను ఒక శాతం మేర తగ్గించే అవకాశం ఉందని అంచనా వేసిన ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మిరిల్ లించ్.. ఇందుకు విదేశీ పోర్టిఫోలియో పెట్టుబడుల ప్రవాహానికి ముడిపెట్టేందుకు ఆస్కారం ఉందని భావిస్తోంది. అక్టోబరులో ఎఫ్‌పీఐలు రూ.38,906 కోట్ల పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్, డెట్‌ సెక్యూరిటీస్‌ నుంచి ఉపసంహరించుకున్నారని డిపాజిటరీల డేటా వెల్లడించింది. You may be interested

క్రూడ్‌ తగ్గుదలతో జీడీపీ జోరు

Thursday 15th November 2018

ఇండియాపై పాజిటివ్‌గా ఉన్నానని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆదిత్య పూరి తెలిపారు. టెక్నాలజీ వల్ల కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై (ఎన్‌బీఎఫ్‌సీ) కఠినమైన పర్యవేక్షణ అవసరమని, అసెట్‌ క్వాలిటీ తారతమ్యాలపై దృష్టి క్రేంద్రీకరించాల్సి ఉందని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సమస్య తగ్గుతోందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. మన వద్ద పూర్తిగా అభివృద్ధి చెందిన

ఆటో స్టాక్స్‌లో ఇవి బెటర్‌..

Thursday 15th November 2018

ఆటో రంగంలో మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్‌, బజాజ్‌ ఆటో స్టాక్స్‌పై బుల్లిష్‌గా ఉన్నామని ఇండిపెండెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ వివేక్‌ మవాని తెలిపారు. మారుతీ సుజుకీ షేరు ఇప్పటికే 25-30 శాతం కరెక‌్షన్‌కు గురయ్యిందని గుర్తుచేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ప్రస్తుత క్వార్టర్‌లో ఆటో రంగ కంపెనీల ఎర్నింగ్స్‌ కొంత నిరుత్సాహానికి గురిచేశాయని తెలిపారు. అయితే మళ్లీ వృద్ధి తిరిగి వస్తుందని

Most from this category