STOCKS

News


మార్కెట్‌ కదలికలపై ఆర్‌బీఐ, సెబీల పర్యవేక్షణ

Monday 24th September 2018
Markets_main1537765488.png-20505

ముంబై: శుక్రవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన నేపథ్యంలో ఫైనాన్షియల్‌ మార్కెట్లను అతి దగ్గరగా పర్యవేక్షిస్తున్నామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ), మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించాయి. సెన్సెక్స్‌ ఒక్కసారిగా 1,127 పాయింట్లను కోల్పోయిన అంశంపై పర్యవేక్షణ చేస్తున్నామని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు విడివిడిగా ప్రకటించాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడులకు సంబంధించిన కేవైసీ నిబంధనలను సవరించినట్లు సెబీ వెల్లడించింది.మౌలిక వసతుల కల్పన సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల చెల్లింపుల పరంగా విఫలమైనట్లు వెల్లడికావడం, నాన్‌-బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సంస్థలకు సంబంధించి ఆందోళనలు వ్యక్తం కావడం లాంటి పలు ప్రతికూల అంశాల కారణంగా శుక్రవారం మార్కెట్లు ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి మళ్ళిన విషయం తెలిసిందే. 



You may be interested

37,340 దాటకపోతే డౌన్‌ట్రెండ్‌ వేగవంతం

Monday 24th September 2018

అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌ మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ మార్కెట్లన్నింటినీ తలదన్ని పెరిగిన భారత్‌ మార్కెట్‌...ప్రస్తుతం ఇతర మార్కెట్లు కోలుకునే ప్రయత్నం చేస్తుంటే. మన సూచీలు పడిపోతున్నాయి. దేశీయ బాండ్ల మార్కెట్లో కొన్ని ఎన్‌బీఎఫ్‌సీల బాండ్లను ఫండ్స్‌ తెగనమ్మడం, ప్రభుత్వం ప్రకటించిన చర్యలు రూపాయి రికవరీకి సహకరించకపోవడం వంటి అంశాలు స్థానిక మార్కెట్‌ను దెబ్బతీసినట్లు కన్పిస్తోంది. అలాగే ఒక్క టీసీఎస్‌ మినహా..మార్కెట్‌ను ముందుకు పడిపిస్తున్న హెవీవెయిట్‌ షేర్లన్నీ 5-15

ఆయిల్‌ ఇండియా రూ.7,000 కోట్ల సమీకరణ

Monday 24th September 2018

ముంబై: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం, ఆయిల్‌ ఇండియా కంపెనీ రూ.7,000 కోట్ల సమీకరణకు ఆ కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. బాండ్ల జారీ,  డిబెంచర్లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన జారీ చేయడం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని ఆయిల్‌ ఇండియా తెలిపింది. అంతేకాకుండా నలుగురు ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల(ఆషా కౌల్‌, ప్రియాంక్‌ శర్మ, ఎస్‌. మనోహరన్‌, అమినా ఆర్‌.ఖాన్‌) నియామానికి కూడా వాటాదారులు ఆమోదం తెలిపారని పేర్కొంది. శనివారం జరిగిన

Most from this category