STOCKS

News


ఆ రెండు అంశాలే డిసైడ్‌ చేస్తాయి!

Friday 28th December 2018
Markets_main1545974488.png-23283

మార్కెట్‌పై ఆనంద్‌ రాఠీ అంచనా
రాబోయే కాలంలో దేశీయ మార్కెట్లను మూడో త్రైమాసిక ఫలితాలు, బడ్జెట్‌లో ప్రభుత్వ చర్యలు ప్రభావితం చేస్తాయని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ ఆనంద్‌ రాఠీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఈ ఏడాది చివరకు చమురు ధరలు శాంతించడం, బ్యాంకుల రీక్యాపిటలైజెషన్ వార్తలు మార్కెట్లను ఆదుకున్నాయని తెలిపింది. ఒక దశలో యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌, ఫెడ్‌ రేట్ల పెంపు తదితర అంశాలు సూచీలను తీవ్ర నెగిటివ్‌ జోన్‌లోకి నెట్టాయని కానీ మన మార్కెట్లు నెమ్మదిగా కోలుకున్నాయని పేర్కొంది. వచ్చే ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలను ప్రకటిస్తే మార్కెట్లకు రుచించకపోవచ్చని అభిప్రాయపడింది. ఇలాంటి పథకాలతో విత్తలోటు విస్తరిస్తుందని తెలిపింది. వచ్చేసంవత్సరం వివిధ అంతర్జాతీయ అంశాలు మార్కెట్లలో ఆందోళన పెంచే అవకాశముందని అంచనా వేసింది.
స్వల్పకాలానికి మూడు షేర్లను బ్రోకరేజ్‌ సంస్థ సిఫార్సు చేసింది.
1. పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ: టార్గెట్‌ రూ. 269. గ్యాస్‌ ఆధారిత వినిమయం పెరగడం, ఇంధన అవసరాల్లో గ్యాస్‌ వాటా 15 శాతానికి చేరడం కంపెనీ దీర్ఘకాల వృద్ధికి అవకాశం కల్పిస్తాయి.
2. ఫినోలెక్స్‌ కేబుల్స్‌: టార్గెట్‌ రూ. 598. వచ్చే రెండేళ్లు ఆదాయం 11 శాతం, లాభం 21 శాతం సరాసరి వృద్ధి నమోదు చేస్తాయని అంచనా. ఉత్పాదక వ్యయాలు పెరగడంతో ఎబిటా 60బీపీఎస్‌ మేర తగ్గవచ్చు.
3. ఎల్‌అండ్‌టీ టెక్‌ సర్వీసెస్‌: టార్గెట్‌ రూ. 2042. ఐఓటీ, ఏఐ, 5జీ లాంటి నూతన సాంకేతికతల విస్తరణతో ప్రపంచమంతా డిజిటల్‌ విస్తృతి అధికమవుతోంది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్‌ అవుట్‌ సోర్సింగ్‌ మార్కెట్‌ 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరి అపార అవకాశాలను అందించనుంది. You may be interested

స్థిరంగా పసిడి

Friday 28th December 2018

ఆర్థిక మందగమన భయాల నేపథ్యంలో ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్ప నష్టంతో 1,279.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే నేడు ఆసియాలో పలు ఈక్విటీ మార్కెట్లలో జరుగుతున్న ర్యాలీ పసిడి ధరకు ప్రతికూలంగా మారనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గత ట్రేడింగ్‌లో పసిడి ధర 8డాలర్ల వరకూ ర్యాలీ చేసింది. డాలర్‌ బలహీనత, ప్రపంచమార్కెట్లో రికవరీ

బెస్ట్‌... ఐఓసీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ

Friday 28th December 2018

- ప్రభుత్వ రంగంలో లాభదాయకమైనవిగా గుర్తింపు - ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా నష్టాల్లోనే న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలో 2017-18 సంవత్సరంలో అత్యంత లాభదాయక కంపెనీలుగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ ముందున్నాయి. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా అధిక నష్టాలతో ఉన్నవిగా నిలిచాయి. పార్లమెంటు ముందు ప్రభుత్వం ఉంచిన పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సర్వేలో ఈ వివరాలు పేర్కొన్నారు. ప్రభుత్వరంగ కంపెనీల పనితీరుకు సంబంధించి సమగ్ర వివరాలు ఇందులో

Most from this category