News


యస్‌ బ్యాంకు చైర్మన్‌ కానున్న రాణా కపూర్‌?

Friday 30th November 2018
Markets_main1543518261.png-22495

ప్రైవేటు బ్యాంకింగ్‌ రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థ ‘యస్‌ బ్యాంకు’ కొంత కాలంగా ఎదుర్కొంటున్న కష్టాలు అతి త్వరలోనే సమసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ బ్యాంకును స్థాపించినప్పటి నుంచి దాని అభివృద్ధిలో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన రాణా కపూర్‌ను ఎండీ, సీఈవోగా మరో మూడేళ్ల పాటు కొనసాగేందుకు ఆర్‌బీఐ అనుమతించకపోవడం, జనవరి 31తో దిగిపోవాలని ఆదేశించడం తెలిసిందే. రాణాకపూర్‌ బయటకు వెళ్లిపోతే బ్యాంకు వృద్ధి ఏమవుతుందోనంటూ భవిష్యత్తుపై ఆందోళనలు తలెత్తాయి. బ్యాంకు ఎన్‌పీఏలను రూ.10,000 కోట్ల మేర తక్కువ చేసి చూపించిందన్న అభ్యంతరాలు ఆర్‌బీఐ నుంచి వ్యక్తం అయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో ఈ స్టాక్‌ రూ.404 స్థాయి నుంచి నెలల వ్యవధిలోనే రూ.147 స్థాయికి పడిపోవడం చూశాం. బ్యాంకు క్రెడిట్‌ రేటింగ్‌ను మూడిస్‌ రెండు రోజుల క్రితం డౌన్‌గ్రేడ్‌ చేయడం కూడా అగ్నికి ఆజ్యం పోసింది. అయితే, బ్యాంకు మరో ప్రమోటర్‌ మధుకపుర్‌తో రాణా కపూర్‌ చేస్తున్న సంధి ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. 

 

ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా నూతన ఎండీ, సీఈవోను ఎంపిక చేసిన తర్వాత... యస్‌ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా తాను బాధ్యతలు పోషించాలని రాణా కపూర్‌ భావిస్తున్నారు. మధు కపుర్‌తో జరుగుతున్న చర్చల్లో ఇదీ కూడా ఒక అంశమేనని ఓ జాతీయ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. తమ మధ్య దీర్ఘకాలంగా ఉన్న వివాదానికి ముగింపు పలికే విషయమై ఇరు ప్రమోటర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. వీరి మధ్య షరతులకు సంబంధించిన ముసాయిదా పత్రం ప్రకారం... యస్‌ బ్యాంకు బోర్డుకు రాణా కపూర్‌ నియాకాన్ని వాటాదారులు, ఆర్‌బీఐ అనుమతించినట్టయితే, ఆయన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ లేదా ఎండీ, సీఈవో లేదా నాన్‌​ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కావచ్చు. బ్యాంకు ప్రస్తుత నిబంధనల మేరకు హోల్‌టైమ్‌ డైరెక్టర్‌గా వైదొలిగిన తర్వాత తిరిగి రెండేళ్ల వరకు మళ్లీ నియమితులు అవ్వడానికి అవకాశం ఉండదు. కనుక బ్యాంకు ఎండీ, సీఈవోగా రాణాకపూర్‌ తిరిగి బాధ్యతల్లోకి రావాలనుకుంటే 2021 జనవరి వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఆర్‌బీఐ, వాటాదారులు ఆమోదం మేరకు రాణా కపూర్‌ను బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ లేదా ఎండీ, సీఈవోగా నియమిస్తే తాము సమ్మతి తెలియజేస్తామని అశోక్‌ కపుర్‌ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా సదరు పత్రిక తన కథనంలో పేర్కొంది. డిసెంబర్‌ 13న జరిగే బోర్డు సమావేశంలో రాణాకపూర్‌ స్థానంలో ఎండీ, సీఈవోతోపాటు ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల నియామకాలను పరిశీలించనుంది. అయితే, ఈ షరతులపై మధుకపుర్‌ ఇంకా ఆమోదం తెలియజేయలేదని సమాచారం. You may be interested

ఎఫ్‌పీఐలు భారీగా కొనుగోలు చేసిన షేర్లు

Friday 30th November 2018

ఎఫ్‌పీఐలు గత రెండు నెలల్లో మన ఈక్విటీ మార్కెట్లలో రూ.30,000 కోట్లకు పైగా అమ్మేశారు. అయితే, దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నికర కొనుగోలు దారులుగా ఉండడంతో స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోకుండా ఆదుకున్నట్టయింది. ముఖ్యంగా ఎఫ్‌పీఐలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికరంగా రూ.10,200 కోట్ల విలువైన అమ్మకాలు జరిపారు. ఆటోమొబైల్స్‌, ఐటీ, మెటల్స్‌, మైనింగ్‌ రంగాల్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు ఎక్కువగా చోటు చేసుకున్నట్టు కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. సెప్టెంబర్‌

పెరిగిన డిఫాల్ట్‌ రిస్క్‌ కంపెనీల జాబితా

Thursday 29th November 2018

default ముంబై: రుణాలను చెల్లించడంలో వైఫల్యం చెంది చివరకు దివాళ దశ వరకు కూడా చేరుకోదగిన కంపెనీల జాబితా ఈ ఏడాదిలో మరింత పెరిగింది. బీఎస్‌ఈ 500 కంపెనీలలో ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 24 సంస్థలు మాత్రమే 0.52 శాతం డిఫాల్ట్‌ రిస్క్‌ దాటిన సంస్థల ఈ జాబితాలో ఉండగా.. ఇప్పుడు వీటి సంఖ్య ఏకంగా 77కు చేరుకుంది. వోడాఫోన్ ఐడియా, దీవాన్ హౌసింగ్, బొంబే డైయింగ్, శ్రీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్,

Most from this category