STOCKS

News


ఫండ్‌ హౌస్‌లకు రూ.700 కోట్లు చెల్లించిన రాణా కపూర్‌..!

Thursday 29th November 2018
Markets_main1543489023.png-22492

ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేరు ధర గడిచిన రెండు రోజుల్లోనే 20 శాతానికి మించి నష్టపోయింది. గురువారం ట్రేడింగ్‌లో రూ.146.75 వద్దకు క్షీణించి 52 వారాల కనిష్టస్థాయిని తిరగరాసింది. ఇంతటి భారీ స్థాయిలో షేరు ధర పతనం కావడంతో బ్యాంకు డిబెంచర్లను కొనుగోలుచేసిన మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌ల నుంచి ప్రమోటర్లపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. యస్‌ బ్యాంక్‌ హోల్డింగ్‌ కంపెనీలైన యస్‌ సెక్యూరిటీస్‌, మోర్గాన్‌ క్రెడిట్స్‌ సంస్థలు షేరు ధర పతనమైనప్పుడల్లా మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌ల పెట్టుబడులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు కొంత మొత్తాన్ని చెల్లించే విధంగా ఒడంబడిక జరిగినట్లు పలు ఆంగ్ల వార్త పత్రికల కథనం ద్వారా తెలుస్తోంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్‌లు.. హోల్డింగ్‌ కంపెనీల గ్యారెంటీతో యస్‌ బ్యాంక్‌ జారీచేసిన నాన్‌ కన్వర్టబుల్‌ బాండ్లను కొనుగోలుచేశాయి. టెంపుల్టన్ తెలియజేసిన వివరాల ప్రకారం.. యస్‌ బ్యాంక్‌ షేర్ల విలువ కనీసం రూ.1,890 కోట్లుగా ఉండాలని వీరి ఇరువురి మధ్య బాండ్ల కొనుగోలు సమయంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒడంబడిక ఆధారంగా 7.56 కోట్ల షేర్లను సెక్యూరిటీ కవర్‌ కింద ఉంచగా.. బుధవారం స్టాక్‌ మార్కెట్‌ ముగిసిన తరువాత వీటి విలువ రూ.1,222 కోట్లుగా మాత్రమే ఉంది. ఇంతభారీ పతనం జరిగింది కనుక.. ఇన్వెస్టర్‌ ఆసక్తిని కాపాడడం కోసం యస్‌ బ్యాంక్‌ రూ.208.9 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడైంది. షేరు ధరలో భారీ పతనం జరిగితే.. అక్కడ నుంచి 14 రోజుల్లో నష్టనివారణ చర్యలు జరగాల్సి ఉంటుందని ఒప్పంద పత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. షేరు ధర రూ.404 నుంచి క్రమంగా రూ.147 వద్దకు పడిపోయిన కారణంగా మ్యూచువల్ ఫండ్‌ హౌస్‌లకు ప్రమోటర్‌ ఫ్యామిలీ రూ.700 కోట్లు చెల్లించినట్లు వెల్లడైంది. అయితే, ఈ విషయంపై ఒక అధికారిక ప్రకటన చేయడానికి ఫండ్‌ హౌస్‌లు నిరాకరించాయని కథనాల్లో ప్రచురించాయి. మరోవైపు ప్రమోటర్లు సైతం చెల్లింపు అంశంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు.
 You may be interested

ఆర్‌బీఐ, ఒపెక్‌ సమావేశాలపై మార్కెట్‌ దృష్టి..!

Thursday 29th November 2018

ముంబై: వచ్చే వారంలో వెల్లడికానున్నటువంటి కీలక అంశాల నేపథ్యంలో దేశీ మార్కెట్లు రేంజ్‌ బౌండ్‌లో ఉండేందుకు అవకాశం ఉందని ఆనంద్ రాఠీ బ్రోకింగ్‌ సంస్థలో ఈక్విటీ అడ్వైజరీ విభాగానికి చెందిన సిద్ధార్థ్ సెడాని వ్యాఖ్యానించారు. ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ ద్వారా ద్రవ్య లభ్యతను ఆర్బీఐ పెంచిన కారణంగా బాండ్‌ ఈల్డ్‌ 8.2 నుంచి 7.65 శాతానికి తగ్గినప్పటికీ.. ఎన్‌బీఎఫ్‌సీ, బ్యాంకింగ్‌ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న రిస్క్‌ ఇన్వెస్టర్లను కాస్త వెనకడుగు

మార్కెట్‌లోకి కొత్త ‘పల్సర్‌ 150’

Thursday 29th November 2018

ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్‌ ఆటో తాజాగా తన పల్సర్‌ 150 నియాన్‌ బైక్‌లో అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్‌ (ఢిల్లీ) ధర రూ.64,998. కొత్త లుక్‌, మంచి పనితీరు కోరుకునే కస్టమర్లకు తొలి ఎంపికగా పల్సర్‌ 150 నియాన్‌ ఉంటుందని బజాజ్‌ ఆటో ప్రెసిడెంట్‌ (మోటార్‌సైకిల్స్‌) ఎరిక్‌ వాస్‌ తెలిపారు. కొత్త పల్సర్‌.. నియాన్‌ రెడ్‌, నియాన్‌ ఎల్లో, నియాన్‌ సిల్వర్‌ అనే మూడు

Most from this category