STOCKS

News


రాణా నిష్క్రమణతో ఇక్కట్లు!

Thursday 20th September 2018
Markets_main1537443102.png-20416

యస్‌బ్యాంక్‌పై బ్రోకరేజ్‌ల అభిప్రాయం
యస్‌బ్యాంక్‌ సారధ్య బాధ్యతల నుంచి రాణా కపూర్‌ వచ్చే ఏడాది జనవరి కల్లా వైదొలగాలని ఆర్‌బీఐ ఆదేశించింది. రాణా వైదొలగడం బ్యాంకు వృద్ధిపై ప్రభావం చూపుతుందని, బ్యాంకు నిధుల సమీకరణ యత్నాలు ఆలస్యమవుతాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. బ్యాంకు షేరు మరింత క్షీణించవచ్చని భావిస్తున్నాయి.
బ్యాంకు షేరుపై బ్రోకింగ్‌ దిగ్గజాల అంచనాలు, అభిప్రాయాలు..
- ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: రేటింగ్‌ను అండర్‌ పెర్ఫామర్‌కు తగ్గించింది. టార్గెట్‌ ధరను రూ. 350 నుంచి రూ. 230కి తగ్గించింది. రాణా పదవీ కాలం పరిమితం చేయడం బ్యాంకుకు పెద్ద ఎదురుదెబ్బని వ్యాఖ్యానించింది. లోన్‌, ఫీజుల వృద్ధి మందగిస్తుందని, ఇప్పటికింకా ఈ విషయం షేరు ధరలో ప్రైస్‌ఇన్‌ కాలేదని తెలిపింది. అందువల్ల భవిష్యత్‌లో మరింత పతనం తప్పదని పేర్కొంది. 
- మాక్కై‍్వరీ: రాణా వైదొలగడం భారీ ఎదురుదెబ్బ. శుక్రవారం భారీ గ్యాప్‌ డౌన్‌ ఉండొచ్చు. 
- సిటీ రిసెర్చ్‌: రేటింగ్‌ను ‘అమ్మొచ్చు’కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. టార్గెట్‌ ధరను రూ. 440 నుంచి రూ. 270కి తగ్గించింది. రాణా కారణంగానే షేరు ప్రీమియంలో ఉందని, ఆయన వైదొలడం ఎదురుదెబ్బని తెలిపింది. మూలధన సమీకరణ యత్నాలు రాణా వైదొలుగుతుండడంతో కుంటుపడతాయని అభిప్రాయపడింది. 
- ఎడెల్‌వీజ్‌: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు తెలిపింది. టార్గెట్‌ను మాత్రం రూ. 453 నుంచి రూ. 375కి తగ్గించింది. తాజా పరిణామం స్వల్పకాలంలో నెగిటివ్‌ ప్రభావం చూపవచ్చు. కానీ బ్యాంకు బలమైన మూలాలున్నందున షేరు కోలుకునే అవకాశాలున్నాయి. కొత్త నాయకత్వంపై సందిగ్ధత తొందరగా తొలగాల్సిఉంటుంది.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 21st September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:39 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 11,359 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 11,273 పాయింట్లతో పోలిస్తే ఏకంగా 86 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. దీంతో నిప్టీ శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఒక్క చైనా మినహా మిగతా ఆసియా

మూడు స్టాకులపై మోర్గాన్‌స్టాన్లీ మక్కువ

Thursday 20th September 2018

ఎస్‌బీఐ, అపోలో హాస్పిటల్స్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్‌ షేర్లపై దృష్టి పెట్టామని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం మోర్గాన్‌ స్టాన్లీ వెల్లడించింది. ఇప్పటివరకు పోర్టుఫోలియోలో ఉన్న ఇన్ఫోసిస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హావెల్స్‌ స్థానంలో ఈ మూడింటిని తీసుకున్నట్లు తెలిపింది. తాజాగా ఎంచుకున్న మూడు స్టాకులు ఈ ఏడాది పేలవ ప్రదర్శన చూపడం గమనార్హం. కానీ మోర్గాన్‌స్టాన్లీ వీటిపై ఓవర్‌వెయిట్‌ ధృక్పథంతో ఉన్నట్లు తెలిపింది. ఎంపికకు కారణాలు.. 1. ఎస్‌బీఐ: ప్రభుత్వం చేపట్టిన రీక్యాప్‌ పథకంతో

Most from this category