STOCKS

News


వెలుగులో మెటల్‌ షేర్లు

Thursday 27th December 2018
Markets_main1545889922.png-23261

మార్కెట్‌ లాభాల ట్రేడింగ్‌లో భాగంగా గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో మెటల్‌ షేర్లు వెలుగులోకి వచ్చాయి. హిందాల్కో, వేదాంత షేర్లు 2శాతం ర్యాలీ మెటల్‌ షేర్లకు కలిసొచ్చింది. ఎన్‌ఎస్‌ఈలోని మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో దాదాపు 1శాతం లాభపడింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ అరశాతం లాభంతో 31113 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లోని మొత్తం 15 షేర్లకు గానూ, 12 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా హిందూస్థాన్‌ కాపర్‌ 3శాతం లాభపడింది. హిందాల్కో, నాల్కో, ఏపిల్‌ అపోలో షేర్లు 2శాతం పెరిగాయి. జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, మెయిల్‌, వేదాంత, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1శాతం ర్యాలీచేయగా, వెల్‌స్పాన్‌కార్పోరేషన్‌ లిమిటెడ్‌, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సెయిల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు ఎన్‌ఎండీసీ, జిందాల్‌ స్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. హిందాల్కో(3 శాతం) షేరు ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 ఇండెక్స్‌లో టాప్‌-5 గెయినర్లలో చివరి స్థానాన్ని దక్కించుకుంది.You may be interested

సన్‌ఫార్మా షైనింగ్‌

Thursday 27th December 2018

ముంబై:- దేశీయ ఔషధ దిగ్గజం సన్‌ఫార్మా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 2.50శాతం లాభపడ్డాయి. పేటెంట్‌ ఉల్లంఘన కేసులో తన అనుబంధ సంస్థ డీయుఎస్‌ఏ ఫార్మాస్యూటికల్స్‌కు అమెరికా ఫెడరల్‌ కోర్టు క్లీన్‌చిట్‌ ఇచ్చినట్లు సన్‌ఫార్మా బుధవారం మార్కెట్‌ ముగింపు అనంతరం స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తతో నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సన్‌ఫార్మా షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా షేర్లు ఇంట్రాడేలో  2.50శాతం ర్యాలీ చేసి రూ.424.00ల గరిష్టాన్ని నమోదు

ఐటీ షేర్లు జంప్‌

Thursday 27th December 2018

కలిసొచ్చిన రూపాయి పతనం డాలర్‌ మారకంలో రూపాయి విలువ తగ్గముఖం పట్టడంతో గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐటీ షేర్లు మార్కెట్‌ ర్యాలీకి దున్నుగా నిలిచిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతానికి లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో ముడిచమురు ధరల 5శాతం రిలీఫ్‌ ర్యాలీ, డాలర్‌ ఇండెక్స్‌ 4 నెలల కనిష్టం నుంచి కోలుకోవడం తదితర కారణాలతో

Most from this category