STOCKS

News


సెబీకి పెనాల్టీ చెల్లించిన ఝున్‌ఝన్‌వాలా

Saturday 1st December 2018
Markets_main1543652874.png-22566

ముంబై:- ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ఝున్‌ఝున్‌వాలా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఆరోపణల వివాదాన్ని పరిష్కరించుకున్నట్లు శుక్రవారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. గతేడాదిలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అనుబంధ సంస్థ జీయోమెట్రిక్‌ షేర్ల ట్రేడింగ్‌లో ఝున్‌ఝున్‌వాలా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి న్యాయపరమైన చర్యలకు పూనుకుంది. ఈ వివాదాన్ని ఝున్‌ఝున్‌వాలా రూ.2.48లక్షల పెనాల్టీ చెల్లింపు ద్వారా సెటిల్‌మెంట్‌ చేసుకున్నట్లు సెబి తెలిపింది. కుదర్చుకున్న సెటిల్‌మెంట్‌లో భాగంగా ఇకపై ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సి అవసరం ఉండదు. ఈ సందర్భంగా సెబీ ‘‘ట్రేడింగ్‌ విషయంలో నిబంధనల ఉల్లంఘన జరిగినా, అనైతిక చర్యలకు పాల్పడినా తిరిగి న్యాయపరమైన చర్యలు తప్పవు’’ అని ఝున్‌ఝున్‌వాలాను హెచ్చరించింది.



You may be interested

నిఫ్టీ చార్టులో డోజీ..!

Saturday 1st December 2018

శుక్రవారం నిఫ్టీ 10,876.75 వద్ద ముగిసింది. 10,892 వద్ద ప్రారంభమైన నిఫ్టీ.. ఇంట్రాడేలో 10,922 పాయింట్ల గరిష్టస్థాయిని, 10,835 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. వరుసగా 5వ రోజు లాభపడిన ఈ సూచీ.. డిసెంబర్‌ సిరీస్‌లో తొలిసారిగా 'డోజీ క్యాండిల్' నమోదుచేసిందని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహమద్‌ అన్నారు. 10,850 స్థాయిని నిలబెట్టుకున్న నిఫ్టీ.. డైలీ చార్టులో డోజీ

ఆసస్‌ కొత్త ఫోన్‌.. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2

Saturday 1st December 2018

తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ’ఆసస్‌’ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకువచ్చేందకు రెడీ అయ్యింది. డిసెంబర్‌ 11న జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించనుంది. ఈ ఫోన్‌ కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎం2 స్మార్ట్‌ఫోన్‌లో నాచ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌-6 ప్రొటెక‌్షన్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. అయితే మిగతా

Most from this category