STOCKS

News


మార్కెట్‌పై బేరిష్‌గా లేను: రాకేశ్ ఝన్‌ఝన్‌వాలా

Tuesday 6th November 2018
Markets_main1541488243.png-21753

  • స్థూల అంశాలన్నీ భారత మార్కెట్‌కు అనుకూలంగా మారిపోయాయని వ్యాఖ్యానించిన ఏస్‌ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా

ముంబై: ప్రస్తుత క్యాలెండర్‌ ఇయర్‌లో స్టాక్‌ సూచీలు జీవితకాల గరిష్టస్థాయి నుంచి ఒక్కసారిగా రెండంకెల పతనాన్ని నమోదుచేయడం చూసి ఏమాత్రం విశ్వాసాన్ని కోల్పోవల్సిన అవసరం లేదని బిగ్‌ బుల్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా వ్యాఖ్యానించారు. 10,000 పాయిం‍ట్ల వద్ద బోటమ్‌ను పరీక్షించిన నిఫ్టీ 11,000-11,100 స్థాయిలో నిరోధాన్ని ఎదుర్కొవచ్చని విశ్లేషించారు. ర్యాలీ కొనసాగనంత మాత్రాన మార్కెట్లపై నమ్మకాన్ని కోల్పోవలసిన అవసరం లేదని, తానైతే భారత మార్కెట్లపై ఎప్పటికీ పూర్తి విశ్వాసంతోనే ఉంటానని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. స్థూల అంశాలన్నీ భారత మార్కెట్‌కు అనుకూలంగా మారిపోయాయని అన్నారు. ఈ అంశాలు మన మార్కెట్ల ర్యాలీకి సహకరించనుండగా.. మార్కెట్లపై బేరిష్‌గా ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మొన్నటివరకు మార్కెట్‌ ప్రయాణానికి ప్రధాన ప్రతిబంధకాలుగా ఉన్న ముడిచమురు, రూపాయి మారకం విలువ ఇప్పుడు కాస్త శాంతించాయన్నారు. ఈ అంశాల కారణంగా దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని, ఇదే సమయంలో దేశీ ఇన్వెస్టర్లు మార్కెట్‌ను నిలబెట్టారని వివరించారు. ఒక్క అక్టోబరులోనే వీరు రూ.38,900 కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ద్వారా ఈక్విటీ, డెట్‌లో వీరి మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ఈఏడాదిలో రూ.లక్ష కోట్లకు చేరిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా ఆందోళన అవసరం లేదనేది రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా సూచన. ‘2013లో నిఫ్టీ 4,800 వద్ద ఉంది. ఐదేళ్లలోనే 11,500 పాయింట్లకు చేరింది. ఇంతటి పెరుగుదలతో పోల్చితే ఎఫ్‌ఐఐ అమ్మకాల వల్ల చోటుచేసుకున్న తాజా కరెక్షన్‌ పెద్ద విషయమే కాదు.’ అని వివరించారు. ఎఫ్‌ఐఐలు అమ్మితే దేశీ ఇన్వెస్టర్లు కొంటున్నారని విశ్లేషించారు. బ్యారెల్‌ ముడిచమురు ధర 65-70 డాలర్ల స్థాయిలోనూ, డాలర్‌తో రూపాయి మారకం విలువ 70-75 స్థాయిలోనూ ‍స్థిరత్వం పొందనున్నాయని అంచనావేశారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ను (నిరర్థక ఆస్తుల) ఎన్‌పీఏ సైకిల్‌ పీక్‌ స్థాయిగా అభివర్ణించారు. ఆర్థిక వ్యవస్థలో క్రిడిట్‌ రిస్క్‌, వ్యవస్థాగత రిస్క్‌ లేనప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్‌పీఏ సైకిల్‌ ముగిసిందని తాను భావిస్తున్నాని, ప్రభుత్వ రంగ బ్యాంకులను సూచిస్తున్నానని చెప్పారు. పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో పెట్టుబడులు పెట్టవచ్చని సిఫార్సుచేశారు. ప్రైవేట్‌ బ్యాంకులలో యస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లను ఎంపిక చేసిన పలు ఎన్‌బీఎఫ్‌సీలను చూడవచ్చని బిగ్‌ బుల్‌ సూచించారు.You may be interested

వ్యాల్యుయేషన్స్‌ మించితే వైదొలగండి

Tuesday 6th November 2018

మార్కెట్‌లో ఇంకా 3-4 శాతం కరెక‌్షన్‌ మిగిలే ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామ్‌డియో అగర్వాల్‌ తెలిపారు. మిడ్‌ క్యాప్స్‌, స్మాల్‌ క్యాప్స్‌లో పతనం కొనసాగుతుందని, మార్కెట్‌ మొత్తంగా చూస్తే దిద్దుబాటుకు గురయ్యిందని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ ఆమోదయోగ్యంగా ఉంటే తప్ప ఎఫ్‌ఐఐలు మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించరని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ద్రవ్యోల్బణానికి సమంగా కార్పొరేట్‌

సంవత్ 2075లో నిఫ్టీ టార్గెట్‌ 11,800..!

Tuesday 6th November 2018

నర్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ హెడ్‌ వినీతా శర్మ విశ్లేషణ ముంబై: ద్రవ్యలభ్యత, వాల్యుయేషన్స్‌, సెంటిమెంట్ వంటి పలు కీలక అంశాల నేపథ్యంలో గతేడాది సూచీలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు కారణంగా దేశీ మార్కెట్లలో అటు డెట్‌లోనూ ఇటు ఈక్విటీలోనూ విదేశీ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడ్డారు. అంతకుముందు ఏడాదిలో 50 డాలర్ల వద్ద ఉన్నటువంటి బ్యారెల్‌ క్రూడ్‌ ధర సంవత్ 2074లో 70 డాలర్లను అధిగమించి కమోడిటీ

Most from this category