News


ఫ్లాట్‌గా రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిస్టింగ్‌

Thursday 11th April 2019
Markets_main1554973417.png-25070

కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో తొలి ఐపీఓగా పేరుపోందిన ప్రభుత్వరంగ సంస్థ రైల్‌ వికాస్‌ నిగమ్‌ స్టాక్ ఎక్స్ఛేంజీలలో యధాతధంగా లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ.19లు కాగా బీఎస్ఈలో ఇదే ధర వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో రూ.19.45 వద్ద గరిష్టాన్ని, రూ.18.60ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇష్యూ ధర(రూ.19)తో పోలిస్తే 0.75శాతం లాభంతో రూ.19.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

రైల్వే శాఖ నిధుల సమీకరణలో భాగంగా రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో షేర్లను విక్రయానికి సిద్ధమైంది. ఇందుకు మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 3వ తేది మధ్య ఐపీఓకు వచ్చింది. ధరల శ్రేణి రూ.17- రూ.19లుగా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం మొత్తం 25.34 కోట్ల ఈక్విటీ షేర్లు(12.12 శాతం వాటా) విక్రయానికి పెట్టింది. తద్వారా రూ. 480 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూకి సంస్థాగత ఇన్వెస్టర్లు 1.36 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుచేయగా.. సంపన్న వర్గాల నుంచి 0.8 శాతమే సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. అయితే రిటైల్‌ ఇన్వెస్టర్లు 2.93 రెట్లు అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఐపీఓకు  యెస్‌ సెక్యూరిటీస్‌, ఎలెరా క్యాపిటల్‌, ఐడీబీఐ క్యాపిటల్‌లు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించాయి. హైస్పీడ్‌ రైళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థగా రైల్‌ వికాస్‌ నిగమ్‌కు పేరుంది.



You may be interested

చిన్న కంపెనీలకు మంచి కాలం!

Thursday 11th April 2019

ఫలితాలు పుంజుకుంటాయి అనిరుద్ధ నాహా వచ్చే మూడేళ్ల పాటు చిన్న, మధ్యతరహా స్టాకులు మంచి ప్రదర్శన చూపుతాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా అసెట్‌ మేనేజర్స్‌ ప్రతినిధి అనిరుధ్ద నాహా చెప్పారు. గతేడాది ఇవన్నీ భారీ పతనం చవిచూశాయని దీంతో వాల్యూషన్లు దిగివచ్చాయని చెప్పారు. ప్రస్తుతం వీటి ఎర్నింగ్స్‌ పుంజుకుంటున్నందున రాబోయే రోజుల్లో మంచి జోరు చూపుతాయన్నారు. మూడేళ్ల క్రితంతో పోలిస్తే చిన్న కంపెనీల బాలెన్స్‌ షీట్లలో గణనీయ మార్పు కనిపిస్తోందన్నారు. చాల కంపెనీల రుణభారాలు

ఎన్నికల వేళ ఎలారా నుంచి సేఫ్‌ స్టాక్స్‌!

Thursday 11th April 2019

రెండు నెలల కన్సాలిడేషన్‌ తర్వాత సూచీలు మార్చిలో పుంజుకున్నాయి. ఎఫ్‌ఐఐ నిధుల ప్రవాహం, మోదీ ప్రభుత్వం మరలా వస్తుందన్న ఆశలు, అంతర్జాతీయంగా లిక్విడిటీ సరళీకరణ విధానాలు.. మార్కెట్‌ను పరుగులు తీయించాయిన ఎలారా క్యాపిటల్‌ తెలిపింది. అయితే ఇకపై ఎన్నికలు దగ్గరపడినందున సూచీల్లో ఆటుపోట్లు అధికంగా ఉంటాయని తెలిపింది. గతేడాది సరాసరితో పోలిస్తే ఇండియా వీఐఎక్స్‌ చాలా ఎక్కువైందని, అందువల్ల సూచీల్లో అధికస్థాయిలో కదలికలుంటాయని అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు ఎకానమీలో

Most from this category