STOCKS

News


నాణ్యతే నికర బలం

Friday 21st September 2018
Markets_main1537524920.png-20445

మార్కెట్‌పై యస్‌ సెక్యూరిటీస్‌
దేశీయ మార్కెట్లో ఈ ఏడాది నాణ్యతే ప్రధానమైన థీమ్‌ అని యస్‌సెక్యూరిటీస్‌ సీఈఓ ప్రశాంత్‌ ప్రభాకరన్‌ చెప్పారు. దీర్ఘకాల వ్యూహంతో నాణ్యమైన స్టాకులను ఎంచుకోవడం ద్వారా స్వల్పకాలిక ఒడిదుడుకులను తట్టుకోవాలని సూచించారు. ఈ ఏడాది మార్కెట్లో నాణ్యమైన స్టాకుల వేట జరుగుతోందని, ఈ తరహా ధృక్పద మార్పు చాలా మంచిదని చెప్పారు. 2008లో ఎడా పెడా నాసిరకం స్టాకుల్లో కొనుగోళ్లు జరిగాయని, దీంతో మార్కెట్‌ ఒక్కసారిగా పతనమైందని వివరించారు. ఈ దఫా అలాంటి పరిస్థితికి ఆస్కారం లేదన్నారు. కేవలం మంచి ఎర్నింగ్స్‌ ఉన్న స్టాకులనే ఇన్వెస్టర్లు నమ్ముతున్నారని చెప్పారు. సెప్టెంబర్‌లో సాధారణంగానే సూచీల్లో కొనుగోళ్లు తక్కువగా ఉంటాయని, కరెక‌్షన్స్‌ కనిపిస్తాయని, ఈ సమయాలను మంచి స్టాకులు కొనేందుకు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రస్తుతం వడ్డీరేట్లు పెరుగుతూ, బాండ్‌ ఈల్డ్స్‌ వృద్ధి చెందుతున్న వేళ ఇన్వెస్టర్లు ఈక్విటీ పోర్టుఫోలియో నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇన్‌ఫ్రా, వినిమయం, రూరల్‌, వ్యవసాయ రంగాలకు చెందిన నాణ్యమైన కంపెనీల షేర్లతో లాంగ్‌టర్మ్‌ కోసం పోర్టుఫోలియో నిర్మించుకోవాలని సూచించారు. ఈ రంగాల్లో పెట్టుబడులు బాగా ఊపందుకుంటున్నాయని చెప్పారు. ఈ ఏడాది డీఐఐలు సైతం క్రమంగా కొనుగోళ్లు తగ్గిస్తున్నాయని చెప్పారు. అంచనాలకు తగినట్లు మార్కెట్లు ప్రవర్తించకపోవడంతో క్రమంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లు తగ్గిస్తున్నారన్నారు. రెండో అర్ధభాగంలో సైతం ఇదే ధోరణి ఉండొచ్చని, డీఐఐలు అనూహ్యంగా నికర కొనుగోళ్లు పెంచడం జరగకపోవచ్చని చెప్పారు. 



You may be interested

రూపాయి రీకవరీ- నష్టాల్లో ఐటీ షేర్లు

Friday 21st September 2018

రూపాయి రికవరీతో శుక్రవారం ఐటీ షేర్లు నష్టాల బాట పట్టాయి. రూపాయి రికవరీకి కేంద్రం తీసుకున్న చర్యలు కారణంగా నేటి ట్రేడింగ్‌లో రూపాయి వారం గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా డాలరు ఆదాయాన్ని ఆర్జించే  ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1.50 శాతం నష్టంతో ముగిసింది. ఈ సూచీలో అత్యధికంగా ఇన్ఫీభీమ్‌ షేరు 22శాతం వరకు నష్టపోయింది. వాటితో వాటితో

పాతాళానికి రియల్టీ షేర్లు

Friday 21st September 2018

మార్కెట్ల పతనంలో భాగంగా రియల్టీ షేర్లు అధ:పాతాళానికి పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 7శాతం వరకూ పతనమైంది. ఇండియాబుల్స్‌ రియల్ఎ‌స్టేట్‌ అత్యధికంగా 13శాతం నష్టపోగా, హెచ్‌డీఐఎల్‌ 10శాతం, గోద్రేజ్‌ పాపర్టీ, ఒబేరాయ్‌ప్రాపర్టీ, యూనిటెక్‌ షేర్లు 7నుంచి 5శాతం వరకు పతనమయ్యాయి. వాటితో పాటు శోభ, బ్రిగ్రేడ్‌, డీఎల్‌ఎఫ్‌ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి. అయితే ప్రిస్టేజ్‌ ఎస్టెట్స్‌ అరశాతం నష్టపోగా, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ షేర్ల

Most from this category