STOCKS

News


పీవీఆర్‌ రూ.750 కోట్ల సమీకరణ

Saturday 29th December 2018
Markets_main1546056081.png-23303

-త్వరలో క్యూఐబీలకు షేర్ల జారీ
- వాటాదారుల ఆమోదం కోరిన కంపెనీ

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ థియేటర్‌ చెయిన్‌ను నిర్వహిస్తున్న పీవీఆర్‌ సంస్థ రూ.750 కోట్లు సమీకరించనుంది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు (క్యూఐబీ) షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరించనున్నామని పీవీఆర్‌ తెలిపింది. ఈ మేరకు తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని, ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరుతున్నామని వివరించింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 29 మధ్యలో వాటాదారులు ఈ ఓటింగ్‌ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని, ఓటింగ్‌ ఫలితాలను వచ్చే నెల 30న వెల్లడిస్తామని తెలియజేసింది. ఈ నిధులను పెట్టుబడుల అవసరాలకు, ఇతర కంపెనీల కొనుగోళ్లకు, రుణ భారం తగ్గించుకోవడానికి, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు, ఇతర సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగిస్తామని పేర్కొంది.
ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎస్‌పీఐ సినిమాస్‌లో 71.69 శాతం వాటాను పీవీఆర్‌ రూ.633 కోట్లకు కొనుగోలు చేసింది. 2016లో రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నుంచి డీటీ సినిమాస్‌ను రూ.433 కోట్లకు చేజిక్కించుకుంది. రూ.750 కోట్ల నిధుల సమీకరణ నేపథ్యంలో బీఎస్‌ఈలో పీవీఆర్‌ షేర్‌ 0.5 శాతం లాభంతో రూ.1,585 వద్ద ముగిసింది.



You may be interested

సెంట్రల్‌ బ్యాంక్‌కు రూ.200 కోట్లు

Saturday 29th December 2018

- ఈసాప్స్‌ ద్వారా సమీకరణ - ఆమోదం తెలిపిన డైరెక్టర్ల బోర్డ్‌ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.200 కోట్లు సమీకరించనున్నది. ఎంప్లాయీ స్టాక్‌ పర్చేజింగ్‌ స్కీమ్‌లో (ఈఎస్‌పీఎస్‌) భాగంగా ఉద్యోగులకు షేర్లు జారీ చేయటం ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఈ మేరకు గురువారం జరిగిన డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని బ్యాంక్‌ వెల్లడించింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందడం

మళ్లీ 70 దిగువకు రూపాయి

Saturday 29th December 2018

ముంబై: రూపాయి మళ్లీ చక్కటి రికవరీతో 70కన్నా దిగువకు వచ్చింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం 69.95 వద్ద ముగిసింది. గురువారంతో పోల్చితే ఇది 40 పైసలు రికవరీ. గురువారం ముగింపు 70.35. డిసెంబర్‌ 20న రూపాయి 69.70 వద్ద ముగిసింది. అటు తర్వాత రూపాయి మళ్లీ ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. ఆరు ప్రధాన విదేశీ కరెన్సీలతో డాలర్‌ బలహీనత,

Most from this category