STOCKS

News


11,800 వద్ద పుట్‌రైటింగ్‌...బుల్లిష్‌నెస్‌కు సంకేతం

Wednesday 17th April 2019
Markets_main1555484713.png-25183

మంగళవారంనాటి ర్యాలీ సమయంలో నిఫ్టీ 11,800 స్ర్టయిక్‌ వద్ద పెద్దస్థాయిలో పుట్‌రైటింగ్‌ జరగడం...ట్రేడర్లు బుల్లిష్‌గా వున్నారనడానికి సంకేతమని టెక్నికల్‌ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు ‘ఇన్‌ ద మనీ’ స్ర్టయిక్‌ అయిన 11,800 వద్ద పెద్ద ఎత్తున ట్రేడర్లు పుట్స్‌ విక్రయించినట్లు, అలాగే 11,700 స్ర్టయిక్‌ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో పుట్‌ రైటింగ్‌ జరిగినట్లు డెరివేటివ్‌ డేటా వెల్లడిస్తున్నది. ఏ స్ర్టయిక్‌ వద్ద పుట్‌ ఆప్షన్ల విక్రయం ఎక్కువగా జరిగితే ఆ స్థాయి దిగువకు సూచీ తగ్గదని ట్రేడర్లు విశ్వసిస్తున్నట్లు లెక్క. తాజా పుట్‌ ఆప్షన్‌ డేటా ప్రకారం 11,800 ఎగువన స్థిరపడలేకపోతే, 11,700 స్థాయి గట్టి మద్దతునివ్వవచ్చని అనలిస్టులు చెపుతున్నారు. మార్కెట్లో మంచి బుల్లిష్‌ సెంటిమెంట్‌ వున్నట్లు పుట్స్‌ విక్రయం సూచిస్తున్నదని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన అనలిస్టు రాజేష్‌ పాల్వియా, షేర్‌ఖాన్‌కు చెందిన రోహిత్‌ శ్రీవాత్సవలు పేర్కొన్నారు. మార్కెట్‌ ఏ మాత్రం తగ్గినా, కొనుగోళ్లు జరుగుతాయని, ఈ డెరివేటివ్‌ కాంట్రాక్టుల ముగింపునకు ముందే నిఫ్టీ 12,000 పాయింట్ల వద్దకు చేరవచ్చని వారు అంచనావేశారు. ఏప్రిల్‌ 25న ఈ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు ముగియనున్నాయి. 



You may be interested

అంచనాల్ని మించిన చైనా జీడీపీ...కుదుటపడిన మార్కెట్లు

Wednesday 17th April 2019

మార్చి క్వార్టర్లో చైనా జీడీపీ వృద్ధి అంచనాల్ని మించి నమోదుకావడంతో ఆసియా మార్కెట్లు స్థిరంగా ముగిసాయి. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చైనా స్థూల ఆర్థిక వ్యవస్థ 6.4 శాతం వృద్ధిచెందినట్లు అధికారిక డేటా వెలువడింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావంతో చైనా జీడీపీ వృద్ధి 6.3 శాతం దిగువన నమోదుకావొచ్చంటూ పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు అంచనావేశాయి. ఈ ఏడాది తమ వృద్ధి రేటు 6–6.5 శాతానికి

నాలుగునెలల కనిష్టానికి పసిడి

Wednesday 17th April 2019

ప్రపంచమార్కెట్లో డాలరు బలోపేతం అయిన నేపథ్యంలో పసిడి ధర మంగళవారం రాత్రి అమెరికా మార్కెట్లో 4నెలల కనిష్టం 1,273 డాలర్ల వద్దకు పడిపోయింది. అయితే బుధవారం ఈ స్థాయి నుంచి స్వల్పంగా కోలుకునే ప్రయత్నాలు చేస్తున్నది. ఆసియాలో ఉదయం గం.11:15ని.లకు గత రాత్రి ధరతో పోలిస్తే ఔన్స్‌ పసిడి ధర స్వల్పంగా లాభపడి 1,281.55 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయంగా రూ.308 క్షీణత:-  అంతర్జాతీయంగా పసిడి 4నెలల కనిష్టానికి పతనమైన నేపథ్యంలో దేశీయంగా పసిడి ఫ్యూచర్లపై ఈ ప్రభావం కన్పించింది.

Most from this category