STOCKS

News


పంద్రాగస్టు లోపే మరో ఆల్‌టైమ్‌ హై???

Wednesday 11th July 2018
Markets_main1531297675.png-18204

పరిస్థితులన్నీ సానుకూలంగా కనిపిస్తున్నాయి..
మార్కెట్‌ పండితుల అంచనా
రెండు మూడునెలల పతనం, కన్సాలిడేషన్‌ అనంతరం సూచీలు మరోమారు సత్తా చాటుతున్నాయి. నిఫ్టీ 10900 పాయింట్ల పైకి, సెన్సెక్స్‌ 36వేల పాయింట్ల పైకి చేరాయి. బుల్స్‌ పట్టు డీస్ట్రీట్‌పై బిగుస్తోన్న సూచనలు స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు ఆగస్టు లోపే మరో ఆల్‌టైమ్‌ హైని తాకుతాయని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. నిఫ్టీ తాజాగా 10930 పాయింట్లను ఛేదించడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. ఈ స్థాయి కర్నాటక ఎన్నికల ఫలితాల రోజు ఇంట్రాడేహై స్థాయి. ఇది చాలా గట్టి నిరోధమని, దీన్ని దాటడం జరిగితే తదుపరి 11171 పాయింట్ల వరకు ఎదురుండదని మార్కెట్‌ పండితుల అంచనా. జనవరిలో నిఫ్టీ ఆల్‌టైమ్‌ హై 11171 పాయింట్లను తాకిన సంగతి తెలిసిందే. ఈ స్థాయికి చేరే లోపు 10950 పాయింట్ల వద్ద కాస్త ఒత్తిడి కనిపించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లు సెల్‌ ఆన్‌ ర్యాలీ స్థితి నుంచి బై ఆన్‌ డిప్స్‌ స్థితికి మారాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు కీలక రిస్కులను సూచీలు తోసిరాజన్నాయి. ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు, రూపాయి క్షీణత, క్రూడాయిల్‌ ధరలో పెరుగుదల అనే మూడు ఆందోళనలను సూచీలు పక్కన పెట్టినట్లు ప్రస్తుతం స్పష్టమవుతోంది. 
తర్వాతేంటి?
నిఫ్టీ ఈ నెల్లో మరో ఆల్‌టైమ్‌ హైని నమోదు చేస్తే ఏడాది చివరకల్లా 11500 పాయింట్లను చేరుతుందని చార్ట్‌వ్యూఇండియా ప్రతినిధి చెప్పారు. గత ఆల్‌టైమ్‌ హై నుంచి వచ్చిన కరెక‌్షన్‌ పూర్తయిందని, 10550 పాయింట్ల వద్ద ప్రస్తుతం గట్టి మద్దతు ఏర్పడిందని వివరించారు. వేవ్‌ థియరీలో ప్రస్తుతం వేవ్‌4 నడుస్తోందన్నారు. ఈ దఫా అప్‌మూవ్‌ బలంగా ఉంటుందన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సైతం ఇదే అంచనాలో ఉంది. వచ్చే నెల 15 లోపే నిఫ్టీ మరోమారు కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకవచ్చని అంచనా వేసింది. 
ఏంచేయాలి?
చిన్నా చితక పతనాలు వచ్చినప్పుడు నాణ్యమైన లార్జ్‌క్యాప్స్‌, మిడ్‌క్యాప్స్‌ను కొనుగోలు చేయమని ఇన్వెస్టర్లకు నిపుణులు సలహా ఇస్తున్నారు. దేశీయంగా లిక్విడిటీ బలంగా ఉన్నందున మార్కెట్లు ముందుకు సాగుతున్నాయని, ప్రస్తుతం కొనసాగుతున్న అప్‌ట్రెండ్‌ మరింత ముందుకు పోతుందని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. 10950 పాయింట్ల నిరోధాన్ని దాటితే నిఫ్టీ మరో ఆల్‌టైమ్‌ హైని చేరుతుందని అంచనా వేసింది. ఈ సమయంలో గత మూడునెలలుగా భారీగా పతనమైన మిడ్‌క్యాప్స్‌లో మంచివి చూసి ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని సూచించింది. కొత్తగా ఎంటరయ్యే ఇన్వెస్టర్లు ఈ స్థాయిల వద్ద కొనుగోళ్లు ఆరంభించవచ్చని సలహా ఇచ్చింది. లార్జ్‌క్యాప్స్‌లో ప్రైవేట్‌బ్యాంక్స్‌, ఆటో, ఫార్మా, సిమెంట్‌స్టాక్స్‌ను పరిశీలించవచ్చని సిఫార్సు చేసింది. You may be interested

మెటల్‌ షేర్లకు ట్రేడ్‌వార్‌ సెగలు..!

Wednesday 11th July 2018

ముంబై:- ట్రేడ్‌వార్‌ సెగలతో బుధవారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. అమెరికా-చైనా దేశాల మధ్య ట్రేడ్‌వార్‌ మరోసారి మొదలవడంతో ప్రపంచవ్యాప్తంగా మెటల్ ఉత్పత్తి తగ్గుతుందనే ఆందోళనలు వెల్లువెత్తాయి. ఫలితంగా నేడు అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ, ఇటు దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతానికి పైగా నష్టపోయింది. మధ్యాహ్నాం గం.1:45ని.లకు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ గత ముగింపు

ఒడిదుడుకుల మార్కెట్‌లో 10 సేఫ్‌ బెట్స్‌..!

Wednesday 11th July 2018

ముంబై: డివిడెండ్‌ ఈల్డ్‌ పరంగా ఆకర్షణీయంగా ఉన్న కంపెనీలు ఒడిదుడుకుల మార్కెట్‌లో సురక్షిత బెట్స్‌గా నిలుస్తాయని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా డివిడెండ్‌ చెల్లిస్తున్న కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా రిస్క్‌ను పూర్తిగా తగ్గించవచ్చని చెబుతున్న వీరు.. ఇటువంటి వాటిలో మల్టీబ్యాగర్లు సైతం ఉండేందుకు అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. ఫండమెంటల్‌ పరంగా చూస్తే.. ఆర్జించిన లాభాలను ఇన్వెస్టర్లకు డివిడెండ్‌ రూపంలో నిలకడగా చెల్లింపులు చేస్తున్న కంపెనీల

Most from this category